గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఎం
Last Updated : శనివారం, 27 ఫిబ్రవరి 2021 (08:36 IST)

నేడు, రేపు కోవిడ్ వ్యాక్సినేషన్‌ బంద్‌

ఈ నెల 27, 28 తేదీల్లో కోవిడ్‌19 వ్యాక్సినేషన్‌ కార్యక్రమం నిలిపివేస్తున్నట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ శుక్రవారం ప్రకటించింది. వ్యాక్సినేషన్‌ ఐటి వ్యవస్థను కోావిన్‌ 1.0 నుంచి కోావిన్‌ 2.0కు మారుస్తున్న కారణంగా శని, ఆదివారాల్లో వ్యాక్సినేషన్‌ ఉండదని ప్రకటనలో తెలిపింది.

మరోవైపు టీకా కార్యక్రమం నిరాటంకంగా కొనసాగుతోందని తెలిపింది. గరువారం నాటికి 1,34,72,643 మందికి టీకా వేసినట్లు ప్రకటించింది. గురువారం ఒక్కరోజే 8,01,480 మంది టీకా వేయించుకున్నారని తెలిపింది.
 
వరుసగా రెండో రోజూ 16 వేలకు పైగా..
దేశంలో కరోనా వైరస్‌ మరోసారి కలవరానికి గురిచేస్తోంది. వరసగా రెండో రోజు రోజువారీ కొత్త కేసులు 16 వేలకు పైగా నమోదయ్యాయి. గత 24 గంటల్లో 8,31,807 పరీక్షలు నిర్వహించగా 16,577 కొత్త కేసులు నమోదయ్యాయని ఆరోగ్య మంత్రిత్వ శాఖ శుక్రవారం ప్రకటించింది.

జమ్ముకాశ్మీర్‌ (820), ఆంధ్రప్రదేశ్‌ (611), ఒడిషా (609) వంటి 21 రాష్ట్రాల్లోనూ కొత్త కేసుల వృద్ధి కనిపిస్తోందని మంత్రిత్వ శాఖ తెలిపింది. దేశంలో మొత్తం కేసుల సంఖ్య 1,10,63,491కు చేరుకుంది. గత 24 గంటల్లో 120 మంది మరణించగా, మొత్తం మరణాల సంఖ్య 1,56,825కి చేరింది. కొన్ని రోజులుగా 100కి పైగానే మరణాలు సంభవిస్తున్న సంగతి తెలిసిందే.

క్రియాశీల రేటులో పెరుగుదల, రికవరీ రేటులో తగ్గుదల కనిపిస్తోంది. కొత్త కేసులతో పోల్చితే రికవరీలు తగ్గుముఖం పట్టడం ఆందోళన కలిగిస్తోంది.