ఆదివారం, 1 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Modified: విజ‌య‌వాడ‌ , శనివారం, 2 అక్టోబరు 2021 (17:15 IST)

గవర్నర్ హరిచందన్ ను కలిసిన సీఎస్. సమీర్ శర్మ

ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ తో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ సమావేశం అయ్యారు. నూతనంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించిన క్రమంలో సమీర్ శర్మ శనివారం గవర్నర్ ను మర్యాదపూర్వకంగా కలిసారు. రాష్ట్రంలో అమలవుతున్న వివిధ సంక్షేమ, అభివృద్ది కార్యక్రమాలు, ప్రభుత్వ ప్రాధాన్యతా అంశాలను గురించి సిఎస్ గవర్నర్ కు వివరించారు.
 
 సర్వీసు తొలి రోజులలో విజయవాడ నగర పురపాలక కమిషనర్ గా పనిచేసిన విషయాన్ని బిశ్వభూషణ్ హరిచందన్ కు తెలియచేసారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ, క్షేత్ర స్దాయి సమస్యల పరిష్కారం పట్ల చొరవ చూపాలని, తదనుగుణంగా అధికార యంత్రాంగాన్ని సమాయత్తం చేయాలని సూచించారు. ఈ సమావేశంలో గవర్నర్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఆర్ పి సిసోడియా, సంయుక్త కార్యదర్శి శ్యామ్ ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.