శనివారం, 28 సెప్టెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By JSK
Last Modified: సోమవారం, 14 నవంబరు 2016 (16:21 IST)

అకటా... పెళ్ళి చదివింపులకూ ఎంత కష్టం... స్వైప్ మిషన్లు తప్పదా?

అమరావతి: పెళ్ళంటే, నట్టింట్లో సందడి. అట్టహాసం చేసినా, అందరికీ విందు భోజనాలు పెట్టినా... చివరికి లాంఛనాలు చదివించినా... అదంతా ఓ ఆచారం, సరదా తతంగం. కానీ, ఇపుడు దానిని నోట్ల రద్దు, దెబ్బతీసింది. మోడీ పేల్చిన బాంబుతో... చాలామంది పెళ్ళి ముహూర్తాలు పెట్టుక

అమరావతి: పెళ్ళంటే, నట్టింట్లో సందడి. అట్టహాసం చేసినా, అందరికీ విందు భోజనాలు పెట్టినా... చివరికి లాంఛనాలు చదివించినా... అదంతా ఓ ఆచారం, సరదా తతంగం. కానీ, ఇపుడు దానిని నోట్ల రద్దు, దెబ్బతీసింది. మోడీ పేల్చిన బాంబుతో... చాలామంది పెళ్ళి ముహూర్తాలు పెట్టుకుందామనుకున్న వారు వెనక్కి తగ్గారు. అప్పటికే మూహూర్తం ఫిక్స్ అయిన వారు సంకటంలో పడ్డారు. 
 
పెళ్ళి ఆపలేరు... ఖర్చులు చేయలేరు... ఎక్కడికి వెళ్లినా చిల్లర సమస్య... పెద్ద నోట్ల ప్రాబ్లం. ఇక పెళ్ళి సందడిలో లాంఛనాలు, చదివింపులు కూడా ఆన్‌లైన్ ట్రాన్ఫర్స్, చెక్కులతో నడిపించాల్సి వస్తోంది. కొందరు అయితే, ఏకంగా వధూవరుల రిసెప్షన్‌కి స్టేజీపైన ఏటీఎం కార్డు స్వైప్ మిషన్ కూడా దగ్గరపెట్టుకుంటున్నారు. వధూవరులకు చదివింపులు ఆన్ ది స్పాట్... ఏటీఎం కార్డు స్వైప్ చేసి మరీ బిల్లు కూడా చేతిలో పెడుతున్నారు... అకటా... ఏమిటీ కరెన్సీ కష్టాలు.