Webdunia - Bharat's app for daily news and videos

Install App
✕

దేవదాస్‌ కనకాల అంత్యక్రియలు పూర్తి

Written By ఎం
Updated: శనివారం, 3 ఆగస్టు 2019 (17:09 IST)
ప్రముఖ నటుడు, దర్శకుడు దేవదాస్ కనకాల(75) అంత్యక్రియలు పూర్తయ్యాయి. మహాప్రస్థానంలో ఆయన భౌతికకాయానికి కుమారుడు రాజీవ్ కనకాల అంత్యక్రియలు నిర్వహించారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న దేవదాస్ హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ శుక్రవారం నాడు తుదిశ్వాస విడిచారు. 
 
శరీరంలోని పలు అవయవాలు పని చేయకపోవడంతో ఆయన మరణించినట్లు హాస్పిటల్ వర్గాలు వెల్లడించాయి. ఆయన మరణవార్త తెలుసుకున్న సినీ ప్రముఖులు మణికొండలోని దేవదాస్ కనకాల ఇంటికి చేరుకొని నివాళులు అర్పించారు. 
 
ప్రముఖ సినీ నటుడు చిరంజీవితో పాటు బ్రహ్మాజీ, హేమ, సమీర్ తదితరులు దేవదాస్ కనకాలకి నివాళులు అర్పించారు.  1945 జులై 30న యానాంలోని కనకాలపేటలో పాపయ్య, మహాలక్ష్మి దంపతులకు పుట్టిన దేవదాస్ కనకాల వందకుపైగా సినిమాల్లో నటించారు. పలు సినిమాలతో పాటు టీవీ సీరియల్స్‌ని తెరకెక్కించారు. 

అన్నీ చూడండి

Medha: శ్రీకాంత్, ఊహల తనయ హీరోయిన్ కాబోతోందట..

Ranbir Kapoor : రామాయణ పార్ట్ 1 కు అడ్వాన్స్ బుకింగ్స్.. IMAX ఫార్మాట్‌లోనూ విడుదల

RT78 : మాస్ మహారాజా రవితేజ క్రైమ్ ను కూడా తులాభారం తో కొలుస్తున్నాడా !

Rajeev Kanakala: స్కూల్ లోనే పిల్లల భవిష్యత్ ఆధారపడుతుంది : రాజీవ్ కనకాల, వితికా షేరు

Gallery 5 NXTinAI: గ్యాలరీ5 NXTinAI: AI వెండితెరపైకి అడుగుపెడుతోంది

తర్వాతి కథనం
Show comments