సీఎం జగన్ గారూ... పింఛన్‌లో చిరిగిన నోట్లా... మీ నాయకులకు కమిషనా? లోకేష్ ప్రశ్న

torn notes
Last Modified శనివారం, 3 ఆగస్టు 2019 (13:52 IST)
తెదేపా నాయకుడు, మాజీ మంత్రి నారా లోకేష్ ట్విట్టర్లో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వంపై కామెంట్లు పోస్టు చేశారు. ట్విట్టర్లో ఇలా పోస్టు చేశారు. "ముఖ్యమంత్రి గారూ, ప్రతీనెలా 1వ తేదీనే అందుకునే పింఛను గత నెల వారం దాటాక ఇచ్చి, ఈ నెల సగమే ఇచ్చి అవ్వాతాతలు, వితంతువులు, దివ్యాంగుల ఉసురు పోసుకుంటున్నారు. పింఛను వెయ్యి పెంచుతామని హామీ ఇచ్చి
250 పెంచారు. ఈ 250లో మీ వైకాపా నాయకులు పెట్టిన హుండీలో 50 వేయాలి.
pensioners

మిగిలిన సొమ్ము చిరిగిపోయిన నోట్లిచ్చి ముసలోళ్ల నోరు కొడుతున్నారు. నా పింఛను మొత్తం ఇవ్వలేదని అవ్వ అడుగుతోంది. చినిగిపోయిన నోట్లిచ్చి మోసంచేశారని తాత నిలదీస్తున్నాడు. పింఛనులో సగమే ఇచ్చారయ్యా అంటోంది ఓ వితంతువు. వైకాపా నేత నా దగ్గర రూ.50 తీసుకుంటున్నాడని వాపోతున్నాడు దివ్యాంగుడు."దీనిపై మరింత చదవండి :