గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 19 నవంబరు 2024 (16:17 IST)

రుషికొండ ప్యాలేస్, 58 గదులను 7 గదులు చేసారు, అవి జగన్ కోసమే.. మంత్రి మాటలు

Durga Mallesh
Durga Mallesh
ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా మంగళవారం రుషికొండ భవనాలపై శాసనమండలిలో వాడీ వేడీ చర్చ జరిగింది. రుషికొండ భవనాలపై అధికార, ప్రతిపక్ష నేతల మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. అయితే సభ్యుల మధ్య చర్చను ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆసక్తిగా గమనించారు. 
 
రుషికొండపై శాసనమండలిలో ఎమ్మెల్సీ దువ్వారపు రామారావు ప్రశ్నలు లేవనెత్తారు. దీనిపై దుర్గేష్ మాట్లాడుతూ.. రుషికొండలో నిర్మాణాలకు అనుమతి తీసుకున్నది ఒకటి కట్టింది మరొకటని ఆరోపించారు. 
 
కేటాయింపులు భిన్నంగా భూవినియోగ మార్పిడి జరిగిందని... రుషికొండకు ఆపారమైన నష్టం కలిగిందని మండిపడ్డారు.  హరిత రిసార్ట్స్ 58 గదులతో ఉండేదని... ఇంతకన్నా అత్బుతమైన నిర్మాణాలు చేస్తామని చెప్పి ప్యాలెస్ కట్టారని.. ఇప్పుడు మొత్తం 7 రూమ్స్ మాత్రమే ఉన్నాయన్నారు. ఇందుకోసం రూ.481 కోట్లు ఖర్చు పెట్టారు. 
 
కేటాయించబోయేమో రూ.451.67 కోట్లు. వాటితో పేదవాడికి 26 వేల మంది ఇళ్లు కట్టోచ్చని చెప్పారు. ఒక వ్యక్తి కోసం ఇంత డబ్బు ఖర్చు చేశారని మండిపడ్డారు. 
 
రుషికొండ వస్తానంటే, వైసీపీ నేతలను బస్సు వేసుకుని తీసుకువెళ్తామన్నారు. కాగా రుషికొండ అంశంపై అసెంబ్లీలో రగడ జరుగుతుండగా.. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆసక్తి వారి మాటలు గమనించారు.