Webdunia - Bharat's app for daily news and videos

Install App

అసెంబ్లీని రద్దు చేయండి: జగన్ కు చంద్రబాబు డిమాండ్

Written By ఎం
Updated: మంగళవారం, 4 ఆగస్టు 2020 (08:22 IST)
మూడు రాజధానుల ఏర్పాటు సరైన నిర్ణయమని భావిస్తే అసెంబ్లీని రద్దు చేయాలని, ఆ తరువాత అందరం కలిసి ప్రజాతీర్పు కోరదామని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు డిమాండ్ చేశారు.

'48 గంటల సమయం ఇస్తున్నా. మా ఎంఎల్‌ఏలు రాజీనామాలు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. మీరు కూడా రాజీనామాలు చేసి రండి. ప్రజల్లో తేల్చుకుందాం' అని చంద్రబాబు ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డినుద్దేశించి సవాల్‌ చేశారు.

హైదరాబాద్‌లోని ఆయన నివాసం నుంచి ఆన్‌లైన్‌ ద్వారా విలేకరుల సమావేశంలో మాట్లాడిన ఆయన 'ప్రజాతీర్పు మూడు రాజధానులకు అనుకూలంగా ఉంటే మేం స్వాగతిస్తాం. నా సవాల్‌ను స్వీకరిస్తారా?' అని ప్రశ్నించారు. రాజధాని సమస్య ఏ ఒక్కరిదో, ఒక్క పార్టీదో కాదని, ఐదు కోట్ల ఆంధ్రులదని అన్నారు. ఎన్నికలకు ముందు మూడు రాజధానుల విషయం ప్రజలకు ఎందుకు చెప్పలేదని ప్రశ్నించారు.

అధికారంలోకి వచ్ని తరువాత మూడురాజధానులు చేస్తామనడం సరికాదు. ఇది ప్రజలకు వెన్నుపోటు పొడవడం, మోసం చేయడమే' అని అన్నారు. అమరావతి రాజధాని విషయంలో రైతులకు అండగా నిలుస్తామని, ఒక వైపు న్యాయపోరాటం. మరో వైపు ప్రజాపోరాటం చేస్తామని అన్నారు. ప్రజలను నమ్మించి మోసం చేసిన వైసిపిని ప్రజాకోర్టులో దోషులుగా నిలబెట్టేందుకు ప్రతి ఒక్కరూ కలిసి రావాలన్నారు.

జగన్‌ పరిపాలన తీరు పిచ్చి తుగ్గక్‌ పాలనలాగా ఉందని పేర్కొన్నారు. ఇప్పటికే న్యాయస్థానాలు 70 సార్లు మొట్టికాయలు వేసినా లోపాలను సరిదిద్దుకోవడం లేదని, దీనిని ఏమంటారని అన్నారు. అసెంబ్లీలో వైసిపి, టిడిపి సభ్యులు మాత్రమే ఉన్నారని, మిగిలిన రాజకీయపార్టీలు కూడా ప్రభుత్వాన్ని రాజీనామా చేయాలని డిమాండ్‌ చేయాలని పిలుపునిచ్చారు.

అన్నీ చూడండి

Senior Naresh: 55 ఏళ్ల సినీ జర్నీ చేస్తున్న డా. నరేష్ విజయకృష్ణకు గోవా గవర్నర్ ఘన సత్కారం

Kamal Haasan: రశ్మికను చూస్తే అసూయ లేదు. గడ్డం తీసినా నేను పాత్రలో మెప్పించలేను : కమల్ హాసన్

Pa Ranjith: విభిన్న కాలమానాలతో పా రంజిత్ చిత్రం వరల్డ్ ఆఫ్ వెట్టువం

Disco Santhi: ఆసుపత్రి నుంచి శాంతి శ్రీహరి డిచ్చార్జ్ - మేఘాంశ్ సినిమా ఆస్మాన్ ను హిట్ చేయండి

Samantha: సమంత రూత్ ప్రభు సెలబ్రిటీ మాస్టర్‌చెఫ్ న్యాయనిర్ణేతగా ఆస్ట్రేలియా చెఫ్ శశి చెలియా

తర్వాతి కథనం
Show comments