బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : గురువారం, 29 అక్టోబరు 2020 (07:26 IST)

కరోనా రాదు అనే నిర్లక్ష్యం వద్దు: కృష్ణా జిల్లా కలెక్టరు ఇంతియాజ్

కరోనా వైరస్ రాదు అనే అభద్రతాభావంతో ఎవరూ ఉండవద్దని, వ్యాక్సిన్ వచ్చేంత వరకు ప్రతి ఒక్కరూ ఇమ్యూనిటీ పెంచుకోవడంతో పాటు  మాస్కులు ధరిస్తూ,భౌతిక దూరాన్ని తప్పనిసరిగా పాటించాలని కృష్ణా జిల్లా కలెక్టరు ఏఎండి ఇంతియాజ్ అన్నారు.
 
కొవిడ్-19 నియంత్రణలో భాగంగా ఉయ్యూరు పట్టణంలో  కలెక్టరు ఏఎండి ఇంతియాజ్ నేతృత్వంలో మున్సిపల్,  వైద్యఆరోగ్య, సచివాలయ అధికారులు సిబ్బంందితో  కలసి ప్రధాన సెంటరు నుండి మున్సిపల్ కార్యాలయం వరకు  కొవిడ్ పై అవగాహన ర్యాలీ నిర్వహించారు. 

అనంతరం పురపాలక సంఘ కార్యాలయంలో మున్సిపల్,  వైద్యఆరోగ్య,రెవిన్యూ,  సచివాలయ అధికారులు సిబ్బందితో ఏర్పాటు చేసిన సమావేశేంలో కలెక్టరు ఏఎండి ఇంతియాజ్ పాల్గొన్నారు.  ఈ  సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో మార్చి నెలలో 25 వ తేదీన తొలి కొవిడ్ కేసు నమోదయ్యిందని, రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలు మేరకు  జిల్లాయంత్రాంగం అప్రమత్తమై అన్ని శాఖల అధికారుల సమన్వయంతో కరోనా వైరస్ నియంత్రణ చర్యలు చేపట్టడం జరిగిందన్నారు.   

కరోనా వైరస్ జిల్లాలో వ్యాప్తి చెందుతున్న ఏప్రిల్, మే  ప్రారంభ మాసాల్లో 225,260 పాజిటివ్ కేసులు ఉన్నప్పుడు  ప్రజలు బయటకు రాకుండా జాగ్రత్తలు తీసుకున్నారన్నారు.  జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబరు మాసంలో కేసులు పెరిగాయన్నారు. ప్రస్తుతం పరిస్థితి  రోజుకు 400  కరోనా పాజిటివ్ కేసులు  వస్తున్న  ప్రజలు కొవిడ్ -19 పై అవగాహన రహితంగా  వ్యవహరిస్తున్నారన్నారు.

కరోనా వైరస్ నియంత్రణకు అధికారులు పూర్తి స్థాయిలో ప్రజల్లో   అవగహాహన కల్పించాఅన్నారు.  నవంబర్ డిసెంబర్ మాసాల్లో కోవిడ్-19 మరింత వ్యాప్తి చెందే అవకాశాలు ఉన్నట్లు  సమాచారం వుందన్నారు.  కరోనా  రాదు అనే అభద్రతాభావంతో ఎవరూ ఉండవద్దని, ప్రతివక్కరు  మాస్కులు ధరించి, సానిటైజర్ తో చేతులు శుభ్రపరచుకోవడం, బౌతిక దూరాన్ని తప్పనిసరిగా పాటించాలని కలెక్టరు ఏఎండి ఇంతియాజ్ అన్నారు.

ప్రతి ఒక్కరికీ పనలు ఉంటాయని ఎవ్వరినీ ఇంట్లో నిర్భందించలేమని ప్రజలు తమ పనులు చేసుకునేటప్పుడు కొవిడ్ -19 నియంత్రణ పై తీసుకోవలసిన మార్గదర్శకాలను తప్పని సరిగా పాటిస్తే నియంత్రణ సులభతరం అవుతుందన్నారు.  కరనా వైరస్ వచ్చిన తరువాత మందులు వాడటం కంటే వ్యాప్తిని  అరికట్టే  విదంగా అధికారులు  ప్రజల్లో చైతన్యం తీసుకురావాలన్నారు.

జగ్గయ్యపేట, మచిలీపట్నం, విజయవాడ, బాపులపాడు, విసన్నపేట, ఏ కొండూరు మండలాల్లో ఎక్కువ  పొజిటివ్ కేసులు నమోదయ్యాయని వాటిని అరికట్టేందుకు అధికారులు చర్యలు తీసుకున్నారన్నారు. వైద్యాధికారులు వారి సిబ్బంది కొవిడ్ లక్షణాలు ఉన్న ప్రతి వ్యక్తిని గుర్తించి ఎక్కువ టెస్టులు నిర్వహించి వ్యాధిని తొలి దశలోనే గుర్తించి మందులు వాడిస్తే శ్వాశకోసవ్యాధులు బారిన పడకుండా ఉండేందుకు అవకాశం ఉంటుందన్నారు.

దీని వలన మరణాలు సంఖ్య కూడా తగ్గుంతుందని తెలిపారు. వైద్యాధికారులు , వారి సిబ్బంది, తాహశీల్థారు, యంపీడీవో టీములు గా ఏర్పడి కరోనా వైరస్ కట్టడికి పటిష్టమైన చర్యలు చేపట్టాలని కలెక్టరు ఇంతియాజ్  అధికారులను ఆదేశించారు. 

ఉయ్యూరు పట్టణంలో నెం.4, నెం.6 వార్డు సచివాయాలయాలను కలెక్టరు ఏఎండి ఇంతియాజ్ పరిశీలించారు. ఈ సందర్బంగా కలెక్టరు వార్డు పర్సన్ అసిస్టెంటు వారు నిర్వహిస్తున్న రిజిస్ట్రర్లను తనికీ చేసారు.  రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ట్రాత్మకంగా చేపడుతున్న పథకాలను సకాలంలో ప్రజలకు చేరువచేసే భాద్యత సచివాలయ ఉద్యోగులదన్నారు. 

సచివాలయాలు ద్వారా 543 ప్రభుత్వం సర్వీసులను ప్రజలకు చేరువచేస్తున్నామని, ప్రజలు దరఖాస్తు చేసిని నిర్ణీత కాలవ్యవధిలోనే వారికి ఆయా సేవలను అందించాలని ఆదేశించారు.  ఇందులో ఎటువంటి అలసత్వం వహించినా అటువంటి వారిపై క్రమ శిక్షణా చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు.

పట్టణంలో ఎంత మందికి రైస్ కార్డులు అందజేసారు. ఇళ్ల పట్టాల ప్రక్రియ ఆన్ లైన్  నమోదు, రిజస్ట్రర్ల నిర్వహణ వంటి మరిన్ని ప్రభుత్వ పథకాల అంశాలకు సంబందించి వార్డు సచివాలయ పర్సన్ అసిస్టంట్లు ఏవిధంగా నిర్వహిస్తుని అడిగి తెలుసుకున్నారు. 

తొలుత పట్టణంలో కరోనా వైరస్ నియంత్రణపై కరోనా వైరస్ కు మాస్కుయే కవచం.. కరోనా కట్టడికి  సకాల వ్యాధి నిర్థారణే ముఖ్యం అంటూ  నినాధలతో ప్రజల్లో అవగాహన కల్పించే విధంగా కలెక్టరు ఇంతియాజ్ నేతృత్వంలో అధికారులు, సిబ్బంది పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు.

కార్యక్రమంలో కమీషనర్ డా. యం.ప్రకాశరావు,తాహశీల్థారు నాగేశ్వరరావు, యంపీడీవో సునీత శర్మ,మునిసిపల్, వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది, అంగన్వాడీ, రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.