గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఎం
Last Updated : శనివారం, 17 అక్టోబరు 2020 (20:46 IST)

కరోనావైరస్ కోరలకు చిక్కిన జీవిత, రాజశేఖర్

ప్రముఖ టాలీవుడ్‌ జంట రాజశేఖర్‌, జీవిత కరోనా బారిన పడ్డారు. వారం రోజుల క్రితమే కరోనా సోకగా..ఆలస్యంగా ఈ విషయం బయటకు వచ్చింది. రాజశేఖర్, జీవితతో పాటు పిల్లలు ఇద్దరికీ కూడా కరోనా సోకినట్లు తెలుస్తోంది. దీనితో వాళ్ల ఫ్యామిలీ మొత్తం కరోనా బారిన పడింది.

రాజశేఖర్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా.. జీవిత, వారి పిల్లలు క్వారెంటైన్‌లో ఉన్నారు. ప్రస్తుతం రాజశేఖర్‌..ప్రముఖ దర్శకుడు నీలకంఠ సినిమాలో నటించేందుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు. దీనికి సంబంధించిన షూటింగ్‌ మొదలు కావాల్సి ఉంది.

అంతలో ఆయనకు కరోనా సోకింది. ఇప్పటికే ప్రముఖ దర్శకుడు రాజమౌళి, నటుడు నాగబాబు, సంగీత దర్శకుడు కీరవాణి, నటి తమన్నా కోవిడ్‌-19 బారిన పడి కోలుకున్న సంగతి విదితమే.