శుక్రవారం, 3 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : మంగళవారం, 27 అక్టోబరు 2020 (18:10 IST)

ఏపీలో మళ్ళీ పెరిగిన కరోనా కేసులు

ఏపీలో కరోనా కేసులు తగ్గినట్టే తగ్గి మరలా పెరుగుతున్నాయి.  ఏపీలో నిన్న రిలీజ్ చేసిన బులెటిన్ ప్రకారం 1901 కేసులు నమోదు కాగా, ఈరోజు రిలీజ్ చేసిన కరోనా బులెటిన్ ప్రకారం గడిచిన 24 గంటల్లో 2901కేసులు నమోదయ్యాయి. 

దీంతో ఏపీలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 8,11,825కి చేరింది.  ఇందులో 7,77,900 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 27,300 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. ఇక గడిచిన 24 గంటల్లో ఏపీలో కరోనాతో 19 మరణాలు సంభవించాయి.  దీంతో ఏపీలో కరోనాతో మరణించినవారి సంఖ్య 6625కి చేరింది. 

ఇక ఇదిలా ఉంటె, ఏపీలోని జిల్లాల్లో నమోదైన కేసుల వివరాలు ఇలా ఉన్నాయి.  అనంతపూర్ లో 153, చిత్తూరులో 272, తూర్పు గోదావరిలో 464, గుంటూరులో 385, కడపలో 127, కృష్ణాలో 411, కర్నూలులో 55, నెల్లూరులో 76, ప్రకాశంలో 153, శ్రీకాకుళంలో 73, విశాఖపట్నంలో 106, విజయనగరంలో 71, పశ్చిమగోదావరి జిల్లాలో 555 కేసులు నమోదయ్యాయి.