ఏపీలో ఇక మూడు బాటిళ్ళ మద్యం రూల్ చెల్లదు
ఇతర రాష్ట్రాల నుంచి మూడు బాటిళ్ళ మద్యం సీసాలను తీసుకోవచ్చన్న నిబంధనలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసింది. ఇప్పటివరకు రాష్ట్రంలో పెద్ద కంపెనీల మద్యం వాడుతుండడంతో దీనికితోడు మద్యం ధర మన రాష్ట్రంలో ఎక్కువగా వుండడంతో మందుబాబులు పక్క రాష్ట్రాల నుంచి మద్యం కొనుక్కుంటున్నారు.
ఒక్కో వ్యక్తి మూడు బాటిళ్ళ మద్యంగానీ, మూడు బీర్లు గానీ, రెండు లీటర్ల కల్లు తెచ్చుకోవచ్చన్న నిబంధనలు ఇదివరకే ఉన్నాయి. దీన్ని అడ్డం పెట్టుకుని పొరుగు రాష్ట్రాల నుంచి మద్యం తీసుకొచ్చి అమ్ముకోవడం కూడా ఎక్కువైంది.
దీంతో రాష్ట్ర ప్రభుత్వం ఏకంగా ఈ నిబంధనలను కూడా రద్దు చేసింది. పొరుగు రాష్ట్రాల నుంచి మద్యం తీసుకురావడాన్ని నేరంగా పరిగణిస్తున్నట్లు జీవో విడుదల చేస్తూ ఉత్తర్వులిచ్చింది.