శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Modified: విజ‌య‌వాడ‌ , సోమవారం, 29 నవంబరు 2021 (17:57 IST)

సచివాలయ సిబ్బంది ఇంటింటి అవగాహన ... 'సిటిజన్‌ అవుట్‌ రీచ్‌'

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్రభుత్వాన్ని ప్రజలకు మరింత చేరువ చేయడానికి వినూత్నంగా సిటిజన్‌ అవుట్‌ రీచ్‌స  కార్య‌క్ర‌మాన్ని చేప‌ట్టింది. ప్రతి నెలా చివరి వారంలో జరిగే సిటిజన్ అవుట్ రీచ్ కార్యక్రమంలో సచివాలయ సిబ్బంది, వార్డ్ వాలంటిర్లు తప్పక  పాల్గొనాల‌ని విజ‌య‌వాడ న‌గ‌ర పాల‌క సంస్థ క‌మిష‌న‌ర్ సూచించారు. వారికి సంబందించిన క్లస్టర్ల‌లో క్షేత్ర స్థాయిలో ప్రతి కుటుంబాన్ని కలసి ప్రభుత్వ సంక్షేమ పథకాలు, ప్రజా సేవలు వంటి వాటిపై అవగాహన కల్పించాలని కమిషనర్ ఆదేశించారు. రెండు రోజుల పాటు సిబ్బంది వారికి కేటాయించిన క్లస్టర్ లలో అవుట్ రీచ్‌ కార్యక్రమం  పకడ్బందీగా పూర్తి చేసేలా ఇన్ ఛార్జ్ అధికారులు పర్యవేక్షించాలని అన్నారు. 
 
 
విజ‌య‌వాడ న‌గ‌రంలోని 286 సచివాలయాల పరిధిలో సిటిజన్ అవుట్ రీచ్‌ కార్యక్రమం నిర్వహించారు. సచివాలయ కార్యదర్శులు, వాలంటీర్లు క్షేత్ర స్థాయిలో ప్రజలకు ప్రభుత్వ సంక్షేమ పథకముల క్యాలెండర్‌  ప్రకారం ఏయే నెలలో ఏయే పథకాలు అమలు అవుతాయనే విషయాలను ప్ర‌జ‌ల‌కు వివ‌రిస్తున్నారు. ప్ర‌భుత్వం స‌చివాల‌యాల ద్వారా అందించే సేవల వివరాలు, సమస్యల పరిష్కారం కోసం సంప్రదించవలసిన సచివాలయ సిబ్బంది ఫోన్ నెంబర్లను తెలియజేస్తున్నారు.