బుధవారం, 8 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: బుధవారం, 1 జనవరి 2025 (23:04 IST)

మద్యం కిక్కుతో విద్యుత్ తీగలపై హాయిగా పడుకున్న తాగుబోతు (video)

Drunk man lying comfortably on electric wires
మద్యం తలకెక్కిన మత్తులో ఓ మందుబాబు ఏకంగా విద్యుత్ స్తంభం పైకి ఎక్కేసాడు. అంతేకాదు... ఎంచక్కా కరెంట్ తీగలపై పడుకున్నాడు. ఐతే ఇలా కరెంటు తీగలపై పడుకున్న ఆ తాగుబోతు ఎలా బ్రతికి బయటపడ్డాడో తెలుసా..?
 
పార్వతీపురం మన్యం జిల్లాలోని పాలకండలో ఓ వ్యక్తి పీకలవరకూ పూటుగా మద్యం సేవించాడు. ఆ తర్వాత వీధిలో తూలుతూ పడుతూ లేస్తూ మెల్లగా కరెంట్ స్తంభం వద్దకు వచ్చాడు. అందరూ చూస్తుండగా... నేను ఈ స్తంభం ఎక్కి చూపిస్తానంటూ ఎవరు వారించినా వినకుండా విద్యుత్ స్తంభం ఎక్కడం ప్రారంభించాడు. దీనితో భయాందోళనకు గురైన స్థానికులు వెంటనే ట్రాన్స్ ఫార్మర్ వద్ద ఫీజు పీకేసారు.
 
ఫలితంగా అతడు ప్రాణాలతో బయటపడ్డాడు. చివరికి ఎలాగో నానా తంటాలు పడి అతడిని కరెంట్ స్తంభం పైనుంచి కిందికి దించారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది.