మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By selvi
Last Updated : సోమవారం, 1 జనవరి 2018 (11:31 IST)

భార్యపై అనుమానంతో ఆమె గొంతుకోశాడు.. ఐదునెలల పసికందును కూడా?

భార్యపై అనుమానంతో ఆ భర్త కిరాతకుడిగా మారాడు. భార్యను, ఐదు నెలల పసికందును గొంతుకోసి హతమార్చాడు. ఈ దారుణ ఘటన మంచిర్యాల జిల్లా నస్పూర్‌‌లో డిసెంబర్ 31న ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకెళితే.. కరీంనగర్‌కు

భార్యపై అనుమానంతో ఆ భర్త కిరాతకుడిగా మారాడు. భార్యను, ఐదు నెలల పసికందును గొంతుకోసి హతమార్చాడు. ఈ దారుణ ఘటన మంచిర్యాల జిల్లా నస్పూర్‌‌లో డిసెంబర్ 31న ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకెళితే.. కరీంనగర్‌కు చెందిన శ్రీనివాస్,అదే జిల్లాలోని నస్పూర్ మండలం‌‌కు చెందిన బాలమ్మను ఏడాది క్రితం వివాహం చేసుకున్నాడు. 
 
బాలమ్మ ఐదు నెలల క్రితం పండంటి బాబుకు జన్మనిచ్చింది. ఇంతలో ఏమైందో ఏమో కానీ శ్రీనివాస్ భార్యపై అనుమానం పెంచుకున్నాడు. భార్యను తనతో పంపించాలని ఆమె పుట్టింటికి వెళ్లి వేధించాడు. తాగి గొడవకు కూడా దిగాడు. దీంతో పెద్దలు జోక్యం చేసుకుని శ్రీనివాస్‌, బాలమ్మలకు నన్పూర్‌లో కాపురం పెట్టించారు.
 
అయితే శ్రీనివాస్‌లో భార్యపై అనుమానం తగ్గలేదు. అంతే ఆదివారం సాయంత్రం మద్యం సేవించి గొడవకు దిగాడు. భార్య వాదించడంతో కోప్రోదిక్తుడైన భర్త ఇంట్లో ఉన్న కత్తితో భార్య గొంతుకోసేశాడు. అనంతరం తల్లిపక్కనే పడుకుని ఉన్న పసికందును కూడా గొంతు కోసి చంపాడు. రక్తపుమడుగుల్లో విగతజీవిగా పడివున్న తల్లి కొడుకులను చూసిన స్థానికులు కంటతడి పెట్టారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు పరారీలో వున్న శ్రీనివాస్‌ కోసం గాలింపు చర్యలు చేపట్టారు.