శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By selvi

భార్యను వదిలించుకోవాలనుకున్నాడు.. కాలువలో కొట్టుకుపోయాడు..

భార్యను వదిలించుకోవాలనుకున్నాడు. కానీ సీన్ రివర్సైంది. చివరకు అతనే బలైపోయిన ఘటన పంజాబ్‌లోని ఫిరోజ్ పూర్ జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే, అన్వర్ మసీహ్ (29), కోమల్ (26) వివాహం 2010లో జరిగింది

భార్యను వదిలించుకోవాలనుకున్నాడు. కానీ సీన్ రివర్సైంది. చివరకు అతనే బలైపోయిన ఘటన పంజాబ్‌లోని ఫిరోజ్ పూర్ జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే, అన్వర్ మసీహ్ (29), కోమల్ (26) వివాహం 2010లో జరిగింది.

గత కొన్ని రోజుల నుంచి వీరిద్దరి మధ్య ఏర్పడిన గొడవలు.. వారిని దూరం చేశాయి. అంతే భార్యను చంపాలని అన్వర్ నిర్ణయించుకున్నాడు. ఇందుకోసం పక్కా ప్లాన్ వేశాడు. 
 
తన తమ్ముడు నాచ్ తార్‌తో కలిసి బుధవారం సాయంత్రం గ్రామానికి సమీపంలో వున్న కాలువ వద్దకు చేరాడు. ఆ తర్వాత వారిద్దరూ కోమల్‌ను ఆ ప్రాంతానికి రప్పించి కాలువలోకి తోసేశారు. కానీ ఆమె అప్రమత్తం కావడంతో కాలువలో పడకుండా ఒడ్డున వున్న చెట్టును పట్టుకుంది. 
 
ఇంతలో ఆమెను నీటిలోకి లాగేందుకు అన్వర్ నీటిలోకి దిగాడు. అంతే సీన్ రివర్సైంది. ప్రమాదవశాత్తు అన్వర్ నీటిలో కొట్టుకుపోయాడు. అది చూసిన తమ్ముడు భయంతో అక్కడి నుంచి పారిపోయాడు. కోమల్ అరుపులు విన్న స్థానికులు అక్కడకు చేరుకుని, ఆమెను కాపాడారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు కొనసాగిస్తున్నారు.