Webdunia - Bharat's app for daily news and videos

Install App
✕

కన్నతల్లిని చంపేశాడు... ఎందుకో తెలుసా?

చిత్తూరు జిల్లాలో దారుణం జరిగింది. ఓ కసాయి.. కన్నతల్లిని చంపేశాడు. కారణం ఏంటో తెలుసా? తాగుడు డబ్బులు ఇవ్వలేదన్న అక్కసుతో ఈ దారుణానికి పాల్పడ్డాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే...

Written By pnr
Updated: బుధవారం, 3 జనవరి 2018 (09:14 IST)
చిత్తూరు జిల్లాలో దారుణం జరిగింది. ఓ కసాయి.. కన్నతల్లిని చంపేశాడు. కారణం ఏంటో తెలుసా? తాగుడు డబ్బులు ఇవ్వలేదన్న అక్కసుతో ఈ దారుణానికి పాల్పడ్డాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
చిత్తూరు జిల్లా వి.కోట మండలం శివునికుప్పం కాలనీకి చెందిన బాలెమ్మ(48), రామకృష్టప్ప గౌడ్‌ దంపతులకు సుబ్రహ్మణ్యం అనే కుమారుడు ఉన్నాడు. మద్యానికి బానిసైన సుబ్రహ్మణ్యం కన్నతల్లిని డబ్బులు ఇవ్వమని వేధిస్తూ వచ్చేవాడు. ఈ క్రమంలో కొత్త సంవత్సరం రోజున డబ్బులు ఇవ్వాలని తల్లిని అడగ్గా ఆమె నిరాకరించింది. దీంతో ఆగ్రహంతో ఊగిపోయిన సుబ్రహ్మణ్యం కన్నతల్లిని దుప్పటితో ఉరివేసి హత్యచేశాడు. 
 
మంగళవారం బాలెమ్మ ఎంతసేపటికీ లేవకపోవడంతో ఆమె మనవరాలు భార్గవి పక్కింటి వారికి చెప్పింది. దీంతో హత్య విషయం వెలుగుచూసింది. తాగి వచ్చిన మామ (సుబ్రహ్మణ్యం) రాత్రి అవ్వతో డబ్బులివ్వమని గొడవపడ్డాడని, తాను భయంతో పక్కింట్లోకి వెళ్ళానని భార్గవి చెప్పింది. దీంతో గ్రామస్థులంతా కలిసి సమీపంలోని మద్యం దుకాణం వద్ద ఉన్న సుబ్రహ్మణ్యాన్ని ఇంటి వద్దకు తీసుకొచ్చి దేహశుద్ధి చేసి పోలీసులకు సమాచారం అందించారు. 
 
ఆ తర్వాత బాలెమ్మ భర్త రామకృష్ణప్ప గౌడ్‌ ఫిర్యాదు మేరకు హత్యకేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పలమనేరు ఆస్పత్రికి తరలించారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. కాగా, సుబ్రహ్మణ్యం గతంలో వావివరసలు మరిచి తల్లిని, చెల్లిని కోరిక తీర్చాలని వేధించేవాడని గ్రామస్థులు చెప్పారు. 
About Author
pnr
ఠాగూర్ పులపాక ప్రముఖ దినపత్రిక ఈనాడు, చెన్నై కార్యాలయంలో 'న్యూస్ కాంట్రిబ్యూటర్‌'గా జర్నలిజం ఓనమాలు నేర్చుకున్నారు. హైదరాబాద్ కార్యాలయంలో 'ఆంధ్రజ్యోతి' సబ్-ఎడిటర్ పని చేశారు. 2007 నుంచి 'వెబ్ దునియా'లో అసిస్టెంట్ ఎడిటర్‌‌గా విధులు నిర్వహిస్తున్నారు..... Read More

అన్నీ చూడండి

Vijay Deverakonda: చారిత్రకథాంశంగా విజయ్ దేవరకొండ రణబాలి ట్రైలర్ డేట్ ప్రకటన

ఈశ్వర్ రాచి రాజు నటిస్తున్న చిత్రంలో నర్తకి పాత్రలో పూజిత పొన్నాడ

Prashanth Neel: ప్రశాంత్ నీల్ సమర్పిస్తున్న హారర్ థ్రిల్లర్‌ 418 రిలీజ్ డేట్ ఫిక్స్

Babumohan: చాక్లెట్ స్టార్ పవన్ హీరోగా పోతిరెడ్డిపల్లి మూవీ ప్రారంభం

వెంకటేష్ - త్రివిక్రమ్ చిత్రం ఆదర్శ కుటుంబం విడుదల వాయిదా

తర్వాతి కథనం
Show comments