సోమవారం, 2 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వరుణ్
Last Updated : శుక్రవారం, 19 జనవరి 2024 (19:13 IST)

వైకాపా నేతల నకిలీ ఓటర్ల దందా : కలెక్టర్ సస్పెన్షన్

girishaa
ఏపీలో అధికార వైకాపా నేతలు సాగించిన నకిలీ ఓటర్ల దందా కారణంగా ఓ జిల్లా కలెక్టర్ సస్పెండ్ అయ్యారు. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశం మేరకు రాష్ట్ర ప్రభుత్వం కలెక్టర్‌ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీచేసింది. ఆయన పేరు గిరీషా. అన్నమయ్య జిల్లా కలెక్టర్. సస్పెన్షన కాలంలో విజయవాడను వదిలి వెళ్లరాదని గిరీషాను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదేశించారు. 
 
గతంలో తిరుపతిలో ఓటర్ కార్డుల డౌన్‌లోడ్‌ ఘటన సమయంలో గిరీషా ఆర్వోగా పనిచేశారు. ఆర్వోగా ఉండి తన లాగిన్, పాస్‌వర్డ్‌లను జిల్లా వైకాపా నేతలకు అప్పగించిన విషయాన్ని కేంద్ర ఎన్నికల సంఘం గుర్తించింది. దీంతో ఆయనపై చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. ఈసీ ఆదేశం మేరకు కలెక్టర్ గిరీషాను సస్పెండ్ చేసింది. ఈయనతో పాటు మరో ఐఏఎస్, ఐపీఎస్ కూడా చర్యలు తీసుకునే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తుంది. 
 
మరోవైపు, తిరుపతి ఉప ఎన్నిక సమయంలో నకిలీ ఓట్ల వ్యవహారం కలకలం రేపిన విషయం తెల్సిందే. కేవలం గిరీషా లాగిన్ నుంచే 30 వేల నకిలీ ఓటరు కార్డులు సృష్టంచినట్టు గుర్తించారు. గిరీషా తన లాగిన్ ఐడీ, పాస్‌వర్డ్‌ను వైకాపా నేతలకు ఇవ్వడంతో వారు ఇష్టారాజ్యంగా నకిలీ ఓటరు కార్డులను సృష్టించారు.