ఆదివారం, 5 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By

తిరుపతికి చేరిన శివప్రసాద్ భౌతికకాయం... హోదా కోసం పోరాడిన వ్యక్తి.. పవన్

కిడ్నీ సంబంధింత సమస్యలతో బాధపడుతూ తుది శ్వాస విడిచిన చిత్తూరు మాజీ ఎంపీ, మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత ఎన్. శివప్రసాద్ భౌతికకాయం చెన్నై నుంచి తిరుపతి తరలించారు. భారీ కాన్వాయ్ వెంట రాగా శివప్రసాద్ భౌతికకాయాన్ని శనివారం సయంత్రం తిరుపతికి తరలించారు. ఆయన మరణవార్త తెలియగానే టీడీపీ శ్రేణులు తిరుపతి ఎన్జీవో కాలనీలోని ఆయన నివాసం వద్దకు భారీగా తరలి వచ్చాయి. శివప్రసాద్ అంత్యక్రియలు ఆయన స్వస్థలం అగరాలలో సోమవారం నిర్వహిస్తారు.
 
కాగా, శివప్రసాద్ మృతి పట్ల జనసేన పార్టీ నేత పవన్ కళ్యాణ్ తన సంతాపాన్ని తెలిపారు. శివప్రసాద్ ఏపీకి ప్రత్యేక హోదా కోసం తనదైన శైలిలో స్పందించారని కితాబిచ్చారు. నటుడిగా, రాజకీయ నాయకుడిగా ఆయన పంథాయే వేరని తెలిపారు. మంత్రిగానూ, ఎంపీగానూ ఎన్నో సేవలు అందించారన్నారు. జనసైనికుల తరపున శివప్రసాద్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నట్టు వివరించారు.