బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By
Last Updated : శుక్రవారం, 20 సెప్టెంబరు 2019 (14:38 IST)

చిత్తూరు మాజీ ఎంపీ శివప్రసాద్‌కు తీవ్ర అస్వస్థత?

చిత్తూరు మాజీ ఎంపీ, టీడీపీ సీనియర్ నేత, సినీ నటుడు శివప్రసాద్‌ తీవ్ర అస్వస్థతకు లోనయ్యారు. దీంతో ఆయన్ను చెన్నైలోని ఓ కార్పొరేట్ ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. 
 
నిజానికి గత కొన్ని రోజులకు ముందు ఆయన అస్వస్థతకు లోనయ్యారు. దీంతో ఆయన్ను చెన్నైకు తరలించి చికిత్స అందించగా ఆయన కోలుకున్నారు. దీంతో ఆయన్ను డిశ్చార్చ్ చేయడంతో ఇంటికి వెళ్లారు. 
 
అయితే, ఆయన మళ్లీ అస్వస్థతకు లోనుకావడంతో చెన్నైకు తరలించి ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. అయితే, ఆయన పరిస్థితి ఆందోళనకరంగా ఉందని ఆస్పత్రి వర్గాలు పేర్కొంటున్నాయి. 
 
ఆయనకు కిడ్నీ సంబంధిత వ్యాధి మళ్లీ తిరగదోడడంతో శుక్రవారం ఉదయం కుటుంబ సభ్యులు మెరుగైన వైద్యం కోసం అందిస్తున్నారు. చిత్తూరు లోక్‌సభ స్థానం నుంచి శివప్రసాద్ రెండుసార్లు టీడీపీ తరపున గెలుపొందారు. 
 
రాష్ట్ర విభజన సమయంలోనూ, విభజన హామీల నెరవేర్చాలని కోరుతూ రోజుకొక వేషం చేసి పార్లమెంట్ సమావేశాలకు హాజరవుతూ. ప్రతి ఒక్క ఎంపీ దృష్టిని తనవైపునకు మరల్చుకున్న విషయం తెల్సిందే. అలాంటి శివప్రసాద్ ఇపుడు వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్నట్టు సమాచారం.