పెనుమాకలో రైతుల నిరసన దీక్ష
గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం పెనుమాక గ్రామములో అమరావతి రాజధాని పెనుమాక ఐకాస ఆధ్వర్యంలో అమరావతి రైతుల నిరసన దీక్ష 348వ రోజు ఆదివారం నిర్వహించారు.
మూడు రాజధానులకు వ్యతిరేకంగా, ఒకే రాజధాని అమరావతి అని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించాలని, పెనుమాక గ్రామ బొడ్డురాయి సెంటర్ వద్ద నినాదించారు.
ఈ నిరసన కార్యక్రమంలో రైతులు ముప్పేర సదాశివరావు, పఠాన్ జానీఖాన్, ముప్పేర మాణిక్యాలరావు, మన్నవ వెంకటేశ్వరరావు, ముప్పేర సుబ్బారావు, మన్నవ కృష్ణారావు, కొల్లి నాగార్జున తదితర రైతులు పాల్గొన్నారు.