341వ రోజుకు రైతుల నిరసన దీక్షలు
మంగళగిరి మండలం బేతపూడిలో అమరావతి కి మద్దతుగా మూడు రాజధానులకు వ్యతిరేకంగా అమరావతి ని ఏకైక రాజధానిగా ప్రకటించాలని గ్రామంలోని రైతులు రైతుకులీలు చేస్తున్నా రిలే నిరసన దీక్షలు ఆదివారం కు 341వ రోజుకు చేరుకున్నాయి .
ఈ సందర్భంగా రైతులు రైతుకులీలు అమరావతి కి అనుకులంగా మూడు రాజధానులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
ఈ కార్యక్రమంలో గైరుబోయిన నాగరాజు వాసా రాము అడవి శ్రీనివాసరావు గుండాల సాంబశివరావు గైరుబోయిన దేవరాజు వాసా వెంకటేశ్వరరావు కలవకోల్లు వరకృష్ణ కలవకోల్లు సాంబయ్య గుండాల వీర రాఘవులు గుంటూరు శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
నీరుకోండలో రైతుల నిరసన
మంగళగిరి మండలం నీరుకోండ గ్రామంలో రైతుల నిరసన దీక్షలు 341 రోజు ఆదివారం రాజధాని అమరావతికి మద్దతుగా నిర్వహించారు.
నిరసన కార్యక్రమంలో నన్నపనేని నాగేశ్వరరావు, నన్నపనేని అరుణ, మాదల కుసుమ, మువ్వ ఇందిరా,నన్నపనేని పద్మ,మాఘం అశోక్ కుమార్, మాదల వెంకటేశ్వరరావు, ముప్పాళ్ళ సాంబశివరావు, ముప్పవరపు రాము, పేటేటి రాంబాబు తదితరులు పాల్గొన్నారు
పెనుమాకలో రైతుల నిరసన దీక్ష
తాడేపల్లి మండలం పెనుమాక గ్రామములో అమరావతి రాజధాని పెనుమాక ఐకాస ఆధ్వర్యంలో అమరావతి రైతుల నిరసన దీక్ష 341 వ రోజు ఆదివారం నిర్వహించారు.
మూడు రాజధానుల కు వ్యతిరేకంగా, ఒకే రాజధాని అమరావతి అని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించాలని,పెనుమాక గ్రామ బొడ్డురాయి సెంటర్ వద్ద నినాదించారు.
ఈ నిరసన కార్యక్రమంలో లో రైతులు, పలగానిసాంబశివరావు,మన్నవ వెంకటేశ్వరరావు, మన్నవ కృష్ణారావు,కళ్ళం బ్రహ్మారెడ్డి,పఠాన్ జానీ ఖాన్,ముప్పవరపు ఆంజనేయులు, కోలా ఆంజనేయులు తదితర రైతులు పాల్గొన్నారు.