సోమవారం, 25 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 25 మే 2024 (19:44 IST)

వామ్మో.. టీడీపీ కూటమి గెలుస్తుందని వైకాపా నేతల బెట్టింగ్‌లు..!

Pk_Varma
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలకు సంబంధించి జరుగుతున్న బెట్టింగ్‌లు బాగానే జరుగుతున్నాయి. సార్వత్రిక ఎన్నికలకు ఈ నెల 13న పోలింగ్‌ జరిగిన సంగతి తెలిసిందే. వాటి ఫలితాలు వచ్చే నెల 4న తేలనున్నాయి. ఏపీ ఎన్నికల ఫలితాలపై డబ్బు సంపాదించడానికి బెట్టింగ్ జోరుగా సాగుతోంది. ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. కొంతమంది వైసీపీ నేతలు టీడీపీ+ కూటమి గెలుపుపై బెట్టింగ్ కడుతున్నారని తెలుస్తోంది. 
 
ఏపీలో అధికారంలోకి టీడీపీ+ కూటమి వస్తుందని అధికార పార్టీకి చెందిన ఈ నేతలు ఏకంగా పదుల కోట్ల పందెం కాసినట్లు సమాచారం.. వారు తమ సొంత పార్టీ బలం కంటే కూటమి బలాన్ని ఎక్కువగా విశ్వసిస్తున్నారని టాక్ వస్తోంది. డబ్బుల కోసం బెట్టింగ్‌లు జోరుగా సాగుతున్నాయి.
 
ఉమ్మడి చిత్తూరు జిల్లాలో బెట్టింగ్ జెట్ స్పీడ్‎ను అందుకుంది. టిడిపి అధినేత చంద్రబాబుతో పాటు మాజీ సీఎం కిరణ్, రాష్ట్ర మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆర్కే రోజా ఇలా ప్రముఖులు బరిలో ఉన్న చిత్తూరు జిల్లాలో పలు రకాల పందాలు కొనసాగుతున్నాయి. 
 
కుప్పంలో లక్ష ఓట్ల టిడిపి టార్గెట్ నుంచి గెలుపు ఓటములపై కూడా రాష్ట్ర వ్యాప్తంగా బెట్టింగులు నడుస్తున్నాయి. మరోవైపు పుంగనూరులో మంత్రి పెద్దిరెడ్డి, నగరిలో మంత్రి ఆర్కే రోజాల గెలుపు ఓటములుపైనా మెజారిటీలు లెక్కలేసుకుంటున్న పందెం రాయుళ్లు పెద్ద ఎత్తున బెట్టింగులకు తెర తీశారు. ఇలా ప్రతి ప్రాంతంలోనూ చిన్నా చితకా లీడర్ల నుంచి అగ్ర నేతల వరకు వారి గెలుపోటముల మధ్య బెట్టింగ్ జోరుగా సాగుతోంది.