మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Modified: విజ‌య‌వాడ‌ , శుక్రవారం, 7 జనవరి 2022 (15:53 IST)

ఇండ‌స్ట్రీ ఎదగకుండా సినిమా పెద్దలు రౌడీయిజం చేస్తున్నారు...

సినిమా టిక్కెట్ల ధరలను తగ్గిస్తూ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్నివ్యతిరేకిస్తూ, సినిమా పరిశ్రమలోని కొందరు హీరోలు దర్శకులు, నిర్మాతలు వ్యంగంగా వ్యాఖ్యానించడం శోచనీయమని ప్రముఖ సినియర్ జర్నలిస్టులు భరద్వాజ, డేని అన్నారు. విజ‌య‌వాడ‌లో శుక్రవారం గాంధీ నగర్ స్థానిక ప్రెస్ క్లబ్ లో సినిమా టికేట్ల ధర తగ్గించాలని ఆంధ్రప్రదేశ్ లో సినిమా పరిశ్రమ అభివృద్ధి చేయలని కోరుతూ విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సినిమా టిక్కెట్లు తగ్గింపును స్వాగతించుదామని, ఆదే విధంగా ఆంధ్రప్రదేశ్ కు సినీ పరిశ్రమని తీసుకొచ్చేందుకు ప్రభుత్వం చొరవ తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. 
 
 
ఆంధ్రప్రదేశ్ లో ఉన్న యువత లోకల్ టెలెంటును వినియోగించుకొని, స్థానికంగానే చిత్ర నిర్మాణాలు జరిపి ఆంధ్రుల జీవీతాల్ని, వారి ఆనందాల్ని, జీవిత వైచిత్రీని వెండితెరపై అవిష్కరించే చిత్ర నిర్మాణానికి ప్రభుత్వం చేయూత నివ్వాలన్నారు. తెలంగాణలో తెలంగాణా సినిమా, ఆంధ్రలో ఆంధ్ర సినిమాని ఎదగకుండా ప్రస్తుతం సినిమా పెద్దలు రౌడీయిజం చేస్తున్నారని తీవ్రంగా దుయ్యబట్టారు. సినిమా అంటే అదో బ్రహ్మ పదార్ధమని, వేల కోట్ల రుపాయల బడ్జెట్ అని, అందువలన టికెట్ల రేట్లు వేలల్లో ఉండాలని చేస్తున్న ఈ దృష్పచారన్ని తిప్పి కొట్టాలని సినిమా అభిమానులకు విజ్ఞప్తి చేశారు. సినిమా టికెట్ల రేట్లు పెంచి అభిమానుల గోంతులుకోస్తూ, అభిమానుల్నీ నిలువు దోపిడి చేస్తున్నారని ఈ దోపిడిని తిప్పి కొట్టాలని విజ్ఞప్తి చేశారు. 
 
 
ప్రపంచ స్థాయి సినిమా తీయలంటే వందల కోట్ల బడ్జెట్ కాదని, కథ ఉండాలని కథతో గుర్తింపు తెచ్చిన శంకర భరణం, చలి చీమలు, మాభూమి లాంటి సినిమాలు, బెంగల్, కేరళాలో, మలయాళంలో సత్యజిత్ రాయ్, మృణాల్ సేన్ లాంటి వారు నిరుపించారని అన్నారు. ప్రజల చేతనే టిక్కెట్ల రేట్లు పెంచాలనే డిమాండ్ చేయించాలనే కుట్ర జరుగుతోంద‌ని ఆరోపించారు. ఈ కుట్రల్ని ఎదుర్కోనవలసిన అవసరం ఉంటుందని అన్నారు.


హైదరాబాద్ లోనే సినిమాలు తీస్తూ, ఆక్కడే జీవిస్తూ, అక్కడే  టాక్సులు కడుతున్నారని ఆరోపించారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్లో సినిమా పరిశ్రమ వేళ్ళునుకునేందుకు తగిన వసతులు కల్పించడంలో ప్రభుత్వం విఫలం చెందిందని విమర్శించారు. తెలంగాణలో తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఏర్పాడిన విధంగానే ఆంధ్రప్రదేశ్ లో ఆంధ్ర ఫిలిం ఛాంబర్ ఏర్పాటు చేయాలని, ప్రస్తుతం హైదరాబాద్ లో ఉన్న బడా డమ్మి ఛాంబర్ రౌడియిజాన్ని సహించబోమని హెచ్చరించారు.