Daily Horoscope
✕

కృష్ణానదిలో మునిగి ఐదుగురు విద్యార్థుల మృతి

Written By సెల్వి
Updated: శనివారం, 17 డిశెంబరు 2022 (12:03 IST)
ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లాలో శుక్రవారం 13-15 ఏళ్ల మధ్య వయసున్న ఐదుగురు విద్యార్థులు కృష్ణానదిలో మునిగి మృతి చెందినట్లు అధికారులు తెలిపారు.
 
ఇప్పటి వరకు ఇద్దరి మృతదేహాలు లభ్యమయ్యాయని, మిగిలిన వారి ఆచూకీ కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని మండల రెవెన్యూ అధికారి సతీష్ కుమార్ తెలిపారు.
 
యెనమలకుదురు సమీపంలో నదిలో స్నానానికి ఏడుగురు విద్యార్థులు నదికి వెళ్లిన సమయంలో మధ్యాహ్నం ప్రమాదం జరిగినట్లు పోలీసు అధికారులు తెలిపారు. 
 
ఇద్దరు బాలురు ఈదుకుంటూ సురక్షితంగా వెళ్లగా, మిగిలిన పిల్లలు మునిగిపోయారు. స్థానిక ఈతగాళ్లు, మత్స్యకారులు వెంటనే సహాయక చర్యలు చేపట్టారు.
 
మృతులు విజయవాడలోని పటమటలంకకు చెందిన బాలు, కమేష్, మున్నా, షేక్ బాజీ, హుస్సేన్‌గా గుర్తించారని, స్థానిక ప్రభుత్వ పాఠశాలలో 8, 9 తరగతుల విద్యార్థులుగా పోలీసులు తెలిపారు.

అన్నీ చూడండి

Soori 7: సూరి ఏడవ కథానాయకుడిగా సూరి 7 చెన్నైలో ఘనంగా ప్రారంభమైంది

Naga Chaitanya :మైథికల్ థ్రిల్లర్ నాగ చైతన్య వృషకర్మ సరికొత్త అడ్వెంచర్ పోస్టర్

Anupama: నా పెళ్లి గురించి ఇంట్లో ఒత్తిడి లేదు. ఇష్టమైనప్పుడు పెళ్లి చేసుకోమనే అన్నారు : అనుపమ పరమేశ్వరన్

Sai Durga Tej: సాయి దుర్గ తేజ్ హీరోగా అనిల్ సుంకర చిత్రం ఈ నెలలోనే రెగ్యులర్ షూటింగ్

Teja Sajja: గరివిడి లక్ష్మి మ్యూజికల్ కాన్సర్ట్ తో గౌరవం తీసుకొచ్చే సినిమా : తేజ సజ్జా

తర్వాతి కథనం
Show comments