ఆదివారం, 1 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కె
Last Modified: విజయవాడ , సోమవారం, 23 ఆగస్టు 2021 (15:52 IST)

జ‌వాను మృత‌దేహాన్ని అప్ప‌గించి తిరిగి వ‌స్తూ....

శ్రీకాకుళం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. పలాస మండలం సున్నాదేవి జాతీయ రహదారిపై జరిగిన ఈ దుర్ఘటనలో నలుగురు పోలీసులు మృతి చెందారు. పలువురు గాయపడ్డారు.
 
 భైరి సారంగపురంలో ఓ జవాను మృతదేహం అప్పగించి. ఏఆర్‌ కానిస్టేబుళ్లు బొలెరో వాహనంలో వెళ్తుండగా, ఈ ప్రమాదం చోటు చేసుకుంది. రహదారిని క్రాస్‌ చేస్తుండగా, వీరి వాహనాన్ని లారీ ఢీకొంది. ఈ ఘటనలో నలుగురు కానిస్టేబుళ్లు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలో పోలీసుల వాహనం నుజ్జునుజ్జయింది. సమాచారం తెలుసుకున్న ఉన్నతాధికారులు ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు.
 
ఈ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారిలో ఏఆర్‌ ఎస్సై కె.కృష్ణుడు, వై. బాబూరావు (HC), పి. ఆంటోనీ (HC), పి. జనార్దనరావు (డ్రైవర్‌) ఉన్నట్టు గుర్తించారు. ఈ ఘటనపై పూర్తి సమాచారం ఇంకా తెలియాల్సి ఉంది.