సోమవారం, 2 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్

వెస్ట్ గోదావరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం - నలుగురి మృతి

ఏపీలోని వెస్ట్ గోదావరి జిల్లాలో భోగి పండుగ రోజున ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో నలుగురు వ్యక్తులు దుర్మరణం పాలయ్యారు. జిల్లాలోని నారాయణపురం నుంచి దువ్వాడకు చేపల లోడుతో వెళుతున్న లారీ ఒకటి తాడేపల్లిగూడెం వద్ద బోల్తాపడింది. లారీ ఒక్కసారిగా అదుపుతప్పి బోల్తాకొట్టడంతో నలుగురు కూలీలు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో ఆరుగురు కూలీలు తీవ్రంగా గాయపడ్డారు. వీరిని స్థానికులు రక్షంచి సమీపంలోని ఆస్పత్రులకు తరలించారు. 
 
ఈ రోడ్డు ప్రమాద వార్త గురించి సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. రోడ్డుపై లారీ బోల్తా కొట్టడంతో 2 కిలోమీటర్ల మేరకు వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. అలాగే, మృతదేహాలను స్వాధీనం చేసుకుని ‌శవపరీక్ష కోసం ఆస్పత్రికి తరలించారు దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.