1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 6 జనవరి 2022 (13:08 IST)

కజకిస్థాన్‌లో నిరసనకారుల కాల్చివేత

ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తున్న నిరసనకారుల పట్ల కజికిస్థాన్ ప్రభుత్వం కఠిన వైఖరిని అవలంభిస్తుంది. ఆందోళనకు దిగిన డజన్ల కొద్ది నిరసనకారులను పోలీసులు కాల్చివేశారు. దీంతో అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. 
 
కజికిస్థాన్ అధ్యక్షుడు కాసిమ్ జోమార్ట్‌కు వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా ఆందోళనలు సాగుతున్నాయి. ప్రభుత్వ భవనాలను లక్ష్యంగా చేస్తూ నిరసనకారులు ఉద్యమిస్తున్నారు. దీంతో పోలీసులు వారిని అదుపు చేసేందుకు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఏకంగా డజన్ల సంఖ్యలో నిరసనకారులు ప్రాణాలు కోల్పోయినట్టు సమాచారం. 
 
మరోవైపు, దేశంలో నెలకొన్న పరిస్థితులను చక్కదిద్దేందుకు కజికిస్థాన్ ప్రభుత్వం రష్యా ప్రభుత్వ సాయాన్ని కోరింది. అలాగే, దేశ వ్యాప్తంగా వెల్లువెత్తుతున్న నిరసనలను అదుపు చేసేందుకు కలెక్టివ్ సెక్యూరిటీ ట్రీటీ ఆర్గనైజేషన్ మద్దతు ఇవ్వాలని కజికిస్థాన్ అధ్యక్షుడు కాసిమ్ జోమార్ట్ తొకయేవ్ కోరారు.