1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Modified: విజ‌య‌వాడ‌ , బుధవారం, 5 జనవరి 2022 (16:01 IST)

పిఠాపురంలో పోలీసుల “సంప్రదాయ సంక్రాంతి” క్రీడా సంబరాలు

తూర్పు గోదావ‌రి జిల్లా పిఠాపురంలో “సంప్రదాయ సంక్రాంతి” క్రీడా పోటీలను స్థానిక ఎమ్మెల్యే పెండెం దొరబాబుతో కలిసి జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్ బాబు లాంఛ‌నంగా ప్రారంభించారు. ఈ క్రీడా పోటీలకు స్థానిక యువతీ, యువకులు, మ‌హిళల నుండి విశేష స్పందన ల‌భిస్తోంది. యువతకు కబడ్డీ, వాలీబాల్, షటిల్ పోటీలు, మహిళలకు రంగవల్లి పోటీలు ఏర్పాటు చేశారు.
 
 
జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో అన్ని సబ్ డివిజన్లలో “సంప్రదాయ సంక్రాంతి” క్రీడా పోటీలు ప్రారంభం కానున్నాయి. సంక్రాంతి పండుగ సందర్భంగా గ్రామాలలో నిర్వహించే కోడి పందాలు, గుండాట, పేకాట వంటి జూదక్రీడలు చట్ట వ్యతిరేకమని, గ్రామాలలో ప్రజలు, యువత ఈ విషయాన్ని గమనించి, చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు దూరంగా ఉండాలన్నారు. అందుకే సంక్రాంతి పండుగను సంప్రదాయ బద్దంగా ఆహ్లాదకరమైన వాతావరణంలో సాంస్కృతిక ఆట పాటలతో, సంప్రదాయ క్రీడలతో జరుపుకోవాలని పిలుపినిచ్చారు. ఎవరైనా కోడి పందాలు, గుండాట, పేకాట వంటి జూదక్రీడలలో పాల్గొంటే చట్టపరమైన చర్యలుంటాయ‌ని చెప్పారు. 
 
 
పోలీసు శాఖ నిర్వహిస్తున్న ఈ క్రీడాపోటీల ప్రారంభోత్సవానికి వచ్చిన స్థానిక ఎమ్మెల్యే పెండెం దొరబాబుకి ఎస్పీ కృతజ్ఞతలు తెలియజేసారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ కుమార్, కాకినాడ పట్టణ డిఎస్పీ భీమారావు, పిఠాపురం సర్కిల్ పోలీసు అధికారులు మరియు సిబ్బంది పాల్గొన్నారు.