శుక్రవారం, 12 జులై 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: శుక్రవారం, 22 మార్చి 2024 (13:40 IST)

అంబటి, భూమన చేతుల మీదుగా 'రోజా రంగుల ప్రపంచం నుండి రాజకీయాల్లోకి': రోజా బయోపిక్ తీస్తారా?

Roja selvamani
రాష్ట్ర పర్యాటక శాఖామంత్రి ఆర్కే రోజా గురించి తెలియనివారు ఎవరుంటారు. సినిమాల్లో ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా వెలిగిన రోజా ప్రస్తుతం రాజకీయాల్లోనూ తనదైన ముద్ర వేసారు. ఈ క్రమంలో ఆమె జీవితంపై ఓ పుస్తకం విడుదల చేసారు.
 
రంగుల ప్రపంచం నుండి రాజకీయాల్లోకి అనే పేరుతో రోజా జీవిత చరిత్రపై వైసిపి నాయకులు భూమన కరుణాకర్ రెడ్డి, అంబటి రాంబాబు చేతులు మీదుగా ఈ పుస్తకాన్ని ఆవిష్కరించారు. పుస్తకం విడుదల సందర్భంగా పలువురు నాయకులు, సెలబ్రిటీలు హాజరయ్యారు. ఇకపోతే.. ఈ పుస్తకం ఆధారంగా చేసుకుని రోజా బయోపిక్ ఎవరైనా తీసేందుకు ప్లాన్ చేస్తారేమో చూడాలి.