ఆదివారం, 17 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 29 నవంబరు 2021 (11:40 IST)

విశాఖ పరవాడ ఫార్మాసిటీలో గ్యాస్ లీక్ : ఇద్దరు కార్మికుల మృత్యువాత

విశాఖపట్టణంలోని పరవాడ ఫార్మాసిటీలో మరోమారు విషవాయువు లీకైంది. వ్యర్థ జలాల పంప్ హౌస్ నుంచి ఈ విష వాయువు లీక్ కావడంతో ఇద్దరు కార్మికులు మృత్యువాతపడ్డారు. మృతులను పాయకరావుపేటకు చెందిన మణికంఠ (25), దుర్గాప్రసాద్(25)గా గుర్తించారు. ఈ గ్యాల్ లీకేజీ ఘటనపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. 
 
కాగా, ఇటీవలి కాలంలో విశాఖపట్టణంలోని ఫార్మా సిటీల్లో గ్యాస్ లీకేజీ ఘటనలు తరచుగా చోటుచేసుకుంటున్నాయి. గతంలో ఎల్జీ పాలిమర్స్ పరిశ్రమలో విష వాయువు లీకై 10 మంది వరకు ప్రాణాలు కోల్పోయారు. అనేక మందిని తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. 
 
ఆ తర్వాత హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ సంస్థలో గ్యాస్ లీకైంది. దీంతో వందల సంఖ్యలో కార్మికులు ప్రాణభయంతో పరుగులు తీశారు. గ్యాస్ లీకవుతుందన్న విషయం తెలియగానే అధికారులు అప్రమత్తమై పెను విపత్తు సంభవించకుండా జాగ్రత్తలు తీసుకున్నారు.