శనివారం, 30 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 26 జూన్ 2022 (20:29 IST)

గజల్ శ్రీనివాస్ గానంతో 1857 "మహువా డాబర్" పోరాట గీత ఆవిష్కరణ

dr gazal srinivas song release
చారిత్రాత్మక 1857 భారత స్వాతంత్ర్య ఉద్యమ మహువా డాబర్, బస్తి, ఉత్తరప్రదేశ్ పోరాట స్ఫూర్తి గీతాన్ని ముఖేష్ మేష్రం, ప్రత్యేక కాదర్శి, ఉత్తరప్రదేశ్ పర్యాటక అభివృద్ధి సంస్థ వారు లక్నోలో ఒక ప్రత్యేక సమావేశంలో విడుదల చేశారు. 
 
విప్లవ వీరుడు పిరయ్ ఖాన్ నాయకత్వంలో 1857లో జరిగిన ఈ పోరాటం జరిగింది. ఆంగ్లేయులు ఎంతో మంది దేశభక్తుల గృహాలకు నిప్పంటించి సజీవంగా వారిని చంపారు. ఎంతో మంది దేశభక్తులను ఉరి తీశారు. 
 
వారి త్యాగాలను స్మరించుకుంటూ ఆ సంఘటనను ట్రిపుల్ గిన్నీస్ వరల్డ్ రికార్డ్స్ గ్రహీత డా.గజల్ శ్రీనివాస్ తన స్వీయ సంగీత సారథ్యంలో గానం చేసిన మహువా డాబర్ స్ఫూర్తి హిందీ గీతాన్ని అజాది అమృత మహోత్సవానికి అంకితం చేశారు. ఈ గీతాన్ని జలంధర్, పంజాబ్‌కు చెందిన కల్నల్ తిలక్ రాజ్ రచించారు.