మంగళవారం, 26 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వరుణ్
Last Updated : గురువారం, 18 జనవరి 2024 (11:54 IST)

ఏపీలో సంక్రాంతి సెలవులు పొడగింపు.. ఎందుకో తెలుసా?

schools
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంక్రాంతి సెలవులు పొడగించారు. సంక్రాంతి సెలవుల తర్వాత అన్ని విద్యా సంస్థలు ఈ నెల 19వ తేదీన తెరుచుకోవాల్సివుంది. కానీ, ఏపీ విద్యాశాఖ మాత్రం ఈ సెలవులను మరో మూడు రోజుల పాటు పొడగిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. రాష్ట్రంలో పాఠశాలలు జనవరి 22వ తేదీన పునఃప్రారంభమవుతాయని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఎస్.సురేశ్ కుమార్ వెల్లడించారు. ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రుల విజ్ఞప్తుల మేరకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు పాఠశాల విద్యాశాఖ విడుదల చేసిన పత్రికా ప్రకటనలో పేర్కొంది. 
 
కానీ, ఏపీలో సంక్రాంతి సెలవులు పొడగించడాని ప్రధాన కారణం లేకపోలేదు. ఈ నెల 19వ తేదీన విజయవాడ ఎంజీ రోడ్డులో ఉన్న స్వరాజ్య మైదానంలో అంబేద్కర్ స్మృతి వనాన్ని ఏపీ ప్రభుత్వం నిర్మించింది. దీని నిర్మాణ పనులు ఇంకా అసంపూర్తిగానే ఉన్నాయి. కానీ, వచ్చే నెలలో సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం అవకాశం ఉందని ప్రచారం సాగుతుంది. 
 
దీంతో హడావుడిగా ఈ స్మృతి వనాన్ని ప్రారంభించేందుకు ఏపీ సర్కారు చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా, శుక్రవారం సీఎం జగన్ ఈ స్మృతి వనాన్ని ప్రారంభిస్తారు. ఇందుకోసం జనాలను తరలించేందుకు బస్సులు భారీ సంఖ్యలో అవసరమవుతాయి. దీంతో స్కూలు బస్సులన్నీ అటువైపు మళ్లించేందుకు వీలుగా పాఠశాలలకు ఇచ్చిన సంక్రాంతి సెలవులను మరో మూడు రోజుల పాటు పొడగించారు.