బుధవారం, 18 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 5 ఆగస్టు 2024 (12:42 IST)

కారంపొడి, నూనెతో మధ్యాహ్న భోజనం.. భావి పౌరుల పట్ల నిర్లక్ష్యమా?

lunch with chilli powder
lunch with chilli powder
ప్రభుత్వ పాఠశాలల్లో కారం పొడితో మధ్యాహ్న భోజనం అందించడం అమానవీయమని బీఆర్‌ఎస్‌ సీనియర్‌ నేత టీ హరీశ్‌రావు అన్నారు. ఈ ఘటన కాంగ్రెస్‌ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి అద్దం పడుతోందని మండిపడ్డారు.
 
నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలం కొత్తపల్లిలోని ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు భోజనం సరిగా లేకపోవడంతో కడుపు నింపుకునేందుకు కారంపొడి, నూనె కలిపిన అన్నాన్ని తీసుకోవడంపై కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. 
 
భారత భావి పౌరుల పట్ల ప్రభుత్వం చాలా బాధ్యతారహితంగా వ్యవహరించడం బాధాకరం. విద్యార్థులకు పౌష్టికాహారం అందించాలనే ఉద్దేశంతో సీఎం అల్పాహార పథకాన్ని పక్కనపెట్టిన ప్రభుత్వం.. మధ్యాహ్న భోజనం అందించడంలో మాత్రం తీవ్రంగా విఫలమవుతోంది. ఇది కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి అద్దం పడుతోందని హరీశ్ రావు ఆరోపించారు.
 
మధ్యాహ్న భోజన పథకానికి సంబంధించి అన్నదాతల బిల్లులు, వంట మనుషులు, సహాయకులకు వేతనాలు పెండింగ్‌లో ఉండడంతో విద్యార్థులకు సరైన భోజనం అందడం లేదని హరీశ్‌రావు అన్నారు. 
 
ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తక్షణమే స్పందించి పెండింగ్ బిల్లులు క్లియర్ చేసి కార్మికుల వేతనాలు చెల్లించి ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు సరిపడా భోజనం అందేలా చూడాలని హరీశ్ రావు కోరారు.