సోమవారం, 27 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By
Last Updated : బుధవారం, 13 ఫిబ్రవరి 2019 (10:40 IST)

వేసవి కాదు.. ఎండల కొలిమి.. కాదు కాదు.. ఎండల ఉప్పెన వచ్చేస్తోంది..

వేసవి వచ్చేస్తోంది. ఎండలు మండిపోనున్నాయి. ఈ ఏడాది ఎండలు చాలా ఎక్కువగా వుంటాయని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. రానున్న వేసవి కాలం.. గత రికార్డులను అధిగమించే ఉష్ణోగ్రతలు నమోదు కానున్నాయని చెప్తున్నారు.


తేమ గాలులు వీచే అవకాశాలు లేకపోవడమే ఇందుకు కారణమని, అల్ప పీడనాలు లేక, మబ్బులు కనిపించక సూర్యరశ్మి నేరుగా భూమిని తాకుతుందని చెబుతున్నారు. దేశంలోని ఎన్నో ప్రాంతాలు 50 డిగ్రీలను మించిన వేడిమిని చూడనున్నాయని అధికారులు చెప్తున్నారు. 
 
ఇటీవల ఫ్రాన్స్‌లో జరిగిన ప్రపంచ వాతావరణ సదస్సులో పాల్గొన్న శాస్త్రవేత్తల్లో అత్యధికులు ఇదే అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. 2019 ఎండాకాలం గతంలో ఎన్నడూ చూడనంత ఉష్ణోగ్రతలను పరిచయం చేస్తుందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. 
 
సూర్యకాంతికి ఎల్ నినోలు తోడు కానున్నాయని, వీటి ప్రభావం ప్రజలపై అధికమని ఆంధ్రా యూనివర్శిటీ వాతావరణ విభాగం ప్రొఫెసర్ రామకృష్ణ తెలిపారు. దీంతో ఈ నెలాఖరు నుంచి ఎండలు మండిపోనున్నాయని, చిన్న చిన్న రిజర్వాయర్లలో నీరు పూర్తిగా ఇంకిపోయే ప్రమాదం ఉంది.

చలి కూడా మరో వారం పదిరోజుల్లో మాయమవుతుంది. ఆపై ఎండాకాలం మొదలు కానుంది. ఈ కాలంలో ఎండలు మండిపోతాయని వాతావరణ శాఖాధికారులు హెచ్చరిస్తున్నారు.