శుక్రవారం, 24 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By
Last Updated : మంగళవారం, 12 ఫిబ్రవరి 2019 (15:10 IST)

భారత మాజీ క్రికెటర్‌పై అల్లరి మూకల దాడి.. హాకీ స్టిక్స్‌తో చితక్కొట్టారు...

భారత మాజీ క్రికెటర్ అమిత్ భండారీపై కొందరు అల్లరి మూకలు దాడి చేశారు. హాకీ స్టిక్స్‌తో దాడి చేయడంతో అతను తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటన ఢిల్లీలోని సెయింట్ స్టీఫెన్ కాలేజీ దానంలో జరిగింది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, అమిత్ భండారీ టీమిండియా మాజీ క్రికెటర్. ప్రస్తుతం ఈయన ఢిల్లీ జిల్లా క్రికెట్ సంఘం (డీడీసీఏ) సీనియర్ ఎంపిక కమిటీ ఛైర్మన్‌గా ఉన్నారు. ఈయనపై సోమవారం దాడి జరిగింది. ఈ ఘటనలో భండారి తల, చెవి భాగంలో తీవ్ర గాయాలు కావడంతో ఆస్పత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు.  పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. 
 
భండారి నుంచి వాంగూల్మం తీసుకొని..పలువురు నిందితులను అరెస్ట్ చేశారు. మరికొందరి కోసం గాలిస్తున్నారు. ఢిల్లీ క్రికెటర్ అనూజ్ డేదా, అతని స్నేహితులు కలిసి భండారిపై దాడికి పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. అండర్-23 జట్టుకు అనూజ్‌ని ఎంపిక చేయకపోవడంతోనే భండారిపై దాడి చేసినట్టు తెలుస్తోంది. 
 
కాగా, భారత క్రికెట్ జట్టు తరపున రెండు వన్డే మ్యాచ్‌లు ఆడిన అమిత్ భండారీపై జరిగిన దాడిని మాజీ క్రికెటర్లు వీరేంద్ర సెహ్వాగ్, గౌతం గంభీర్‌లు తీవ్రంగా ఖండించారు. నిందితులను కఠినంగా శిక్షించాలని, భవిష్యత్‌లో ఇలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా జాగ్రత్తలు తీసుకోవాలని వారు కోరారు.