శనివారం, 5 అక్టోబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 5 అక్టోబరు 2024 (12:30 IST)

బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావం.. ఏపీ, తెలంగాణలపై తీవ్ర వర్ష ప్రభావం

Rains
బంగాళాఖాతంలో ఏర్ప‌డిన‌ మరో అల్పపీడనం ప్ర‌భావం కార‌ణంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో రానున్న నాలుగు రోజుల పాటు భారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని భారత వాతావరణ కేంద్రం (ఐఎండీ) అంచనా వేసింది. అల్పపీడనం ప్రభావం ఏపీ, తెలంగాణ‌పై తీవ్రంగా ఉండనుందని ఐఎండీ హెచ్చ‌రించింది‌.
 
ఇక ఈ అల్ప‌పీడ‌నం ప్ర‌భావంతో రానున్న నాలుగు రోజులు ఏపీలోని పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావ‌ర‌ణ శాఖ‌ వెల్ల‌డించింది. కాగా, రాయలసీమలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండ‌డంతో ఈ ప్రాంతంలోని జిల్లాలకు ఐఎండీ అధికారులు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. 
 
ఇకపోతే.. ఏపీలోని తిరుపతి, అన్నమయ్య, చిత్తూరు, కర్నూలు, శ్రీ సత్యసాయి, నంద్యాల, అనంతపురం, ప్రకాశం, వైఎస్ఆర్‌ జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. 
 
ఇక తెలంగాణలోని హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, నిర్మల్, నిజామాబాద్, ఆదిలాబాద్, రంగారెడ్డి, జోగులాంబ గద్వాల్ జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావర‌ణ శాఖ అధికారులు వెల్ల‌డించారు.