సోమవారం, 27 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వరుణ్
Last Updated : మంగళవారం, 11 జులై 2023 (17:16 IST)

నైరుతి రుతుపవనాల ప్రభావం - ఏపీలో 24 గంటల్లో వర్షాలు

rain
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నైరుతి రుతుపవనాల ప్రభావంతో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. గడిచిన 24 గంటల వ్యవధిలో అనేక జిల్లాల్లో గణనీయంగా వర్షపాతం నమోదైంది. కాగా, నేడు, రేపు కూడా కోస్తాంధ్రలో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. 
 
పార్వతీపురం మన్యం, అల్లూరి, కాకినాడ, పల్నాడు, అన్నమయ్య, శ్రీకాకుళం, బాపట్ల, గుంటూరు, తూర్పు గోదావరి, వెస్ట్ గోదావరి, ఎన్టీఆర్, కోనసీమ, ఏలూరు జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని తెలిపారు. 
 
అదేసమయంలో విజయనగరం, నెల్లూరు, అనకాపల్లి, ప్రకాశం, శ్రీ సత్యసాయి, తిరుపతి, నంద్యాల, అనంతపురం జిల్లాల్లో చిరు జల్లులు కురుస్తాయని వెల్లడించింది. వర్షాలు కురిసే ప్రాంతాల్లో ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచింది. 
 
తెలంగాణాకు ఐఎండీ హెచ్చరిక.. 
 
తెలంగాణాలో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీచేసింది. ఉత్తర తమిళనాడు తీరానికి ఆనుకుని నైరుతి బంగాళాఖాతంలో సోమవారం ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఇది ప్రస్తుతం సముద్ర మట్టానికి 5.8 కి.మీ దీంతో పాటు నైరుతి రుతుపవనాల ప్రభావంతో రానున్న ఐదు రోజుల పాటు రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణం కేంద్రం హెచ్చరించింది. 
 
దీంతో పలు జిల్లాలలకు ఎల్లో అలర్ట్ కూడా చేశారు. ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబ్ బాద్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో నేడు భారీ వర్షాలు కురుస్తాయని స్పష్టం చేశారు. రేపు కొమరం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, వరంగల్, హన్మకొండ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయి. అలాగే, 13, 14 తేదీల్లో ఆదిలాబాద్, కొమరం భీం అసిఫాబాద్, కొత్తగూడెం, భూపాలపల్లి, ములుగు, నిర్మల్, మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. 
 
ఈ నెల 15వ తేదీన మంచిర్యాల, జగిత్యాల, రాజన్న సిరిసిల్, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, కొమరం భీం అసిఫాబాద్, ఆదిలాబాద్ జిల్లాల్లో పలు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. కానీ నైరుతి రుతుపవనాల ప్రభావంతో ఉత్తరాది రాష్ట్రాలు భారీ వర్షాలు కురుస్తాన్నాయి. భారీ వర్షాలకు కార్లు కొట్టుకుపోతున్న ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. దేశ రాజధాని ఢిల్లీ సహా ముంబైలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. అయితే, దక్షిణాది రాష్ట్రాల్లో ఆశించిన స్థాయిలో వర్షాలు పడటం లేదు. తెలంగాణాలో ఇప్పటివరకు సాధారణం కంటే 36 శాతం లోటు వర్షపాతం నమోదైంది.