మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 18 నవంబరు 2021 (11:07 IST)

తెలంగాణ - ఏపీలకు నేడు రేపు భారీ వర్షాలు

బంగాళాఖాతంలో కేంద్రీకృతమైవున్న అల్పపీడన ప్రభావం కారణంగా గురువారం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో కొన్ని ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురవనున్నాయి. ఈ అల్పపీడనం తమిళనాడు తీర ప్రాంతాలకు గురువారం చేరే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. దీనికి అనుబంధంగా 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకూ గాలులతో ఉపరితల ఆవర్తనం ఉంది. 
 
అల్పపీడన ప్రాంతం నుంచి తెలంగాణ వైపు తక్కువ ఎత్తులో గాలులు వీస్తున్నాయి. వీటి ప్రభావంతో గురు, శుక్రవారాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయి. 
 
బుధవారం ఉదయం 8 నుంచి రాత్రి 8 గంటల వరకూ 63 ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షాలు కురిశాయి. అత్యధికంగా గోపాల్‌పేట(వనపర్తి జిల్లా)లో 3.3, కాటారం(జయశంకర్‌ భూపాలపల్లి)లో 2.2 సెంటీమీటర్ల వర్షం కురిసింది. ఉష్ణోగ్రత సాధారణం కన్నా 7 డిగ్రీల వరకూ పెరగడంతో చలి తీవ్రత తగ్గింది.