సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 18 నవంబరు 2021 (08:00 IST)

ఏపీలో నేడు పరిషత్ ఎన్నికల ఫలితాల వెల్లడి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఇటీవల మండల పరిషత్ (ఎంపీటీసీ), జిల్లా పరిషత్ (జడ్పీటీసీ)లకు ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల ఫలితాలు గురువారం వెలువడనున్నాయి. ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభంకానుంది. 10 జడ్పీటీసీ, 123 ఎంపీటీసీ స్థానాలకు ఈ నెల 16న పోలింగ్‌ జరిగిన విషయం తెల్సిందే. 
 
ఈ ఎన్నికల ప్రక్రియలో భాగంగా, ఇప్పటికే 14 జెడ్పీటీసీ స్థానాల్లో 4 ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 10 చోట్ల పోలింగ్‌ నిర్వహించారు. 176 ఎంపీటీసీ స్థానాల్లో 50 ఏకగ్రీవమయ్యాయి. 
 
మూడు చోట్ల ఎవరూ నామినేషన్లు వేయలేదు. మిగిలిన 123 స్థానాలకు పోలింగ్‌ నిర్వహించారు. ఓట్ల లెక్కింపు కోసం జిల్లాల్లో యంత్రాంగం ఏర్పాట్లు చేసిందని రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారులు తెలిపారు.