1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By TJ
Last Modified: ఆదివారం, 12 నవంబరు 2017 (17:01 IST)

తిరుపతికి వచ్చి హిజ్రాలతో పెట్టుకుంటే.. చంపేస్తారంతే...

తిరుపతిలోని ఆర్టీసీ బస్టాండులో ఒక వ్యక్తి దారుణ హత్య తీవ్ర చర్చనీయాంశంగా మారుతోంది. ఎప్పుడూ ప్రయాణీకులతో కిటకిటలాడే బస్టాండ్ లోనే హిజ్రాలు ఒక వ్యక్తిపై దాడి చేసి దారుణంగా హత్య చేయడం అటు భక్తులను ఇటు స్థానికులు భయాందోళనకు గురిచేస్తోంది.

తిరుపతిలోని ఆర్టీసీ బస్టాండులో ఒక వ్యక్తి దారుణ హత్య తీవ్ర చర్చనీయాంశంగా మారుతోంది. ఎప్పుడూ ప్రయాణీకులతో కిటకిటలాడే బస్టాండ్ లోనే హిజ్రాలు ఒక వ్యక్తిపై దాడి చేసి దారుణంగా హత్య చేయడం అటు  భక్తులను ఇటు స్థానికులు భయాందోళనకు గురిచేస్తోంది. 
 
తిరుపతి బస్టాండులో తెల్లవారుజామున ఒక్కసారిగా అలజడి. కొంతమంది హిజ్రాలు ఒక వ్యక్తిపై దాడికి దిగారు. విచక్షణా రహితంగా వ్యక్తిని కొడుతున్నా ఎవరూ పట్టించుకోలేదు. తాము వెళ్ళి అడ్డుకుంటే తమపై కూడా దాడి జరుగుతుందేమోనని భయపడిన ప్రయాణీకులు మిన్నకుండి పోయారు. దీంతో హిజ్రాలు మరింత రెచ్చిపోయి రక్తం వచ్చేవరకు ఆ వ్యక్తిని కొట్టారు. 
 
ఇంతకీ ఎవరా వ్యక్తి. అసలేం జరిగింది. నెల్లూరు జిల్లా ఆత్మకూరుకు చెందిన రసూల్ రెండు నెలల క్రితం తిరుపతికి వచ్చి ఇక్కడే టైలర్‌గా పనిచేస్తున్నాడు. నిన్న రాత్రి పూటుగా మద్యం సేవించిన రసూల్ బస్టాండ్ వద్దకు వచ్చి అక్కడే కూర్చుని ఉన్నాడు. అటువైపుగా వెళుతున్న కొంతమంది హిజ్రాలు రసూల్‌ను డబ్బులు అడిగారు. అయితే డబ్బులు ఇచ్చేది లేదని రసూల్ చెప్పడంతో పాటు వారిని హేళనగా మాట్లాడారు. దీంతో కోపోద్రిక్తులైన హిజ్రాలు కొంతమంది కలిసి రసూల్‌ను చితకబాదారు. 
 
కొడుతున్నాసరే రసూల్ దుర్భాషలాడుతుండటంతో మరింత ఆగ్రహంతో హిజ్రాలు చావబాదారు. రక్తపు మడుగులో రసూల్ అక్కడికక్కడే మృతి చెందాడు. రసూల్ మరణించిన విషయాన్ని పోలీసులకు ప్రయాణీకులు సమాచారం అందించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకునే లోపే హిజ్రాలు అక్కడి నుంచి పరారయ్యారు. హిజ్రాల కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఆధ్మాత్మిక క్షేత్రం, అందులోను ఎప్పుడూ జనావాసాలు ఉండే ఆర్టీసీ బస్టాండులో ఒక వ్యక్తిని హిజ్రాలు దాడి చేసి చంపేయడంతో స్థానికులు, భక్తులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.