మంగళవారం, 7 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : శుక్రవారం, 3 నవంబరు 2017 (14:28 IST)

గాయని పి.సుశీల ఆరోగ్యంపై వదంతులు... క్షేమంగా ఉన్నట్టు ట్వీట్

సీనియర్ సినీ నేపథ్యగాయని పి. సుశీల ఆరోగ్యంపై సోషల్ మీడియాలో వివిధ రకాల వదంతులు వ్యాపించాయి. శుక్రవారం ఉదయం అనారోగ్యం కారణంగా ఆమె తిరిగిరాని లోకాలకు చేరుకున్నట్టు వార్తలు గుప్పుమన్నాయి. ఈ వదంతులు సోషల్

సీనియర్ సినీ నేపథ్యగాయని పి. సుశీల ఆరోగ్యంపై సోషల్ మీడియాలో వివిధ రకాల వదంతులు వ్యాపించాయి. శుక్రవారం ఉదయం అనారోగ్యం కారణంగా ఆమె తిరిగిరాని లోకాలకు చేరుకున్నట్టు వార్తలు గుప్పుమన్నాయి. ఈ వదంతులు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. 
 
దీంతో పి. సుశీల స్వయంగా ఫేస్‌బుక్ లైవ్‌లోకి వచ్చి స్పందించారు. "ప్రస్తుతం తాను అమెరికాలో ఉన్నానని, ఇక్కడకు వచ్చిన నెల రోజులు అయిందనీ, రేపు లేదా ఎల్లుండి (శనివారం లేదా ఆదివారం) అమెరికా నుంచి బయలుదేరి స్వదేశానికి చేరుకోనున్నట్టు తెలిపారు. పైగా, తాను సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నానని, తన ఆరోగ్యంపై వచ్చిన వదంతులు నమ్మవద్దని" ఆమె అందులో విజ్ఞప్తి చేశారు.