అమ్మాయిలు అదుర్స్ : ఆసియాకప్ విజేత భారత్
భారత హాకీ మహిళలు దుమ్మురేపారు. అబ్బాయిలకు ఏమాత్రం తీసిపోమని నిరూపించారు. తిరుగులేని ప్రదర్శనతో ఆసియాకప్ కైవసం చేసుకొని రికార్డు సృష్టించారు. ఆదివారం జపాన్‌లోని కకామిగహరలో నువ్వానేనా అన్నట్టు జరిగిన ఫ
భారత హాకీ మహిళలు దుమ్మురేపారు. అబ్బాయిలకు ఏమాత్రం తీసిపోమని నిరూపించారు. తిరుగులేని ప్రదర్శనతో ఆసియాకప్ కైవసం చేసుకొని రికార్డు సృష్టించారు. ఆదివారం జపాన్‌లోని కకామిగహరలో నువ్వానేనా అన్నట్టు జరిగిన ఫైనల్లో భారత్ షూటౌట్‌లో 5-4తో చైనాను చిత్తుచేసింది.
నవ్‌జ్యోత్ కౌర్ (25వ నిమిషంలో)గోల్ చేయడంతో తొలుత టీమిండియా 1-0తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఆ తర్వాత తియాన్‌తియాన్ లువో (47వ ని)లో గోల్ కొట్టడంతో చైనా 1-1తో స్కోర్ సమంచేసింది. మ్యాచ్ ముగిసేసరికి మరో గోల్ నమోదు కాకపోవడంతో షూటౌట్ అనివార్యమైంది. ఉత్కంఠభరితంగా సాగిన షూటౌట్ రెండు జట్లు 4-4తో నిలిచాయి.
చివరి అవకాశంలో కెప్టెన్ రాణి గోల్ కొట్టింది. ఆ తర్వాత చైనా విఫలంకావడంతో భారత్ 5-4తో చైనాకు షాకిచ్చింది. గ్రూప్ దశలోనూ చైనాను భారత జట్టు చేతిలో ఓడిపోయిన విషయం తెల్సిందే. ఈ టోర్నీలో అమ్మాయిల జట్టు అద్భుతంగా ఆడింది. గ్రూప్ దశను అజేయంగా ముగించింది. క్వార్టర్‌లో కజకిస్థాన్‌పై గెలిచింది. సెమీ ఫైనల్లో డిఫెండింగ్ ఛాంపియన్ జపాన్‌ను మట్టికరిపించింది.
ఉత్కంఠతగా సాగిన మ్యాచ్‌లో చైనాను ఓడించి ఆసియా ఛాంపియన్‌గా నిలిచింది. ఈ విజయంతో అమ్మాయిలు, అబ్బాయిలు ఆసియాకప్ గెలిచినట్టైంది. ఆసియాకప్ విజేతగా నిలిచిన భారత్ 2018లో జరిగే మహిళల ప్రపంచకప్‌కు నేరుగా అర్హత పొందింది. 2004 తర్వాత అమ్మాయిలు ఆసియాకప్ గెలవడం ఇదే తొలిసారి.