శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : శనివారం, 13 మార్చి 2021 (11:08 IST)

సెలవులు వాయిదా వేసుకున్న ఎస్‌ఈసీ నిమ్మగడ్డ.. కారణం?!

గతంలో తాను పెట్టిన సెలవులను వాయిదా వేసుకున్నారు ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్. గతంలో ఈ నెల 17వ తేదీ నుంచి 24వ తేదీ వరకు సెలవుపెట్టుకున్నారు నిమ్మగడ్డ రమేష్.

అయితే, ఈ నెల 18వ తేదీన మేయర్‌, ఛైర్మన్‌ ఎంపిక ప్రక్రియలో తన అవసరం ఉందని భావిస్తున్నానంటూ తాజాగా రాష్ట్ర గవర్నర్‌కు లేఖ రాశారు.

మేయర్, ఛైర్మన్‌ ఎంపిక ప్రక్రియ కారణంగా సెలవులు వాయిదా వేసుకుంటున్నట్టు వెల్లడించిన ఆయన.. ఈ నెల 19 నుంచి 22వ తేదీ వరకు సెలవులపై మధురై, రామేశ్వరం వెళ్లనున్నట్టు స్పష్టం చేశారు.

కాగా, ఇప్పటికే పంచాయతీ ఎన్నికలు విజయవంతంగా నిర్వహించిన ఎన్నికల కమిషన్‌.. ఆ తర్వాత మున్సిపల్, మున్సిపల్ కార్పొరేషన్, నగర పంచాయతీలకు కూడా ఎన్నికలు నిర్వహించింది.

ఈ నెల 14వ తేదీన ఓట్లను లెక్కించి ఫలితాలను ప్రకటించనున్నారు.. ఇక, ఆ తర్వాత మేయర్, డిప్యూటీ మేయర్, చైర్మన్ల ఎన్నిక జరగనున్న విషయం తెలిసిందే.