చేలో హరర్ బొమ్మ ... పంట రక్షణ కోసం యువ రైతు వినూత్నప్రయోగం
పంటపై పక్షులు వాలి నాశనం చేస్తున్నాయి. దీని కోసం ఏం చేయాలని ఓ యువ రైతు ఆలోచన చేశాడు... అంతే, ఓ మంచి అయిడియా వచ్చింది. అతి తక్కువ ఖర్చుతో దానిని ఆచరణలో పెట్టాడు. చూడండి...ఇలా ఓ బొమ్మ పంటను రక్షిస్తోంది.
ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం ముత్నూర్ గ్రామానికి చెందిన యువ రైతు ముండే సాయికిరణ్ అటవి జంతువులు, పక్షుల భారి నుండి పంటను కాపాడుకునేందుకు ఈ హర్రర్ బొమ్మను తయారు చేశాడు. దీనికి ఓ సైకిల్ హాండీల్, ఒక డబ్బా, ఒక పైపు , ఒక స్ప్రింగ్ తో జోడించి సైకిల్ హాండీల్, డబ్బాకు ఓ పాత అంగిని తొడిగి... బొమ్మను అమర్చి స్టాండును ఏర్పాటు చేశాడు.
గాలీ వీచినప్పుడల్లా ఈ బొమ్మ తనకు తాను ఇలా అటు ఇటూ ఊగుతుంది. దీంతో వ్యవసాయ క్షేత్రంలో ఉన్న పంటలపై వాలే పక్షులు, అడవి జంతువులు ఈ బొమ్మ ఊగడం చూసి ఉలిక్కిపడి పంట పొలంలోకి రాకుండా దూరంగా అటు వైపే వెళ్ళి పోతున్నాయి. వ్యవసాయ దారులకు ఈ ఊగే బొమ్మ చాలా ఉపయోగపడుతోంది. దీనికి కేవలం రూ. 900 మాత్రమే ఖర్చు అవుతోందని, ఎవరికైనా ఈ ఊగే బొమ్మ కావాల్సి ఉంటే తాను తయారు చేసి ఇస్తానని యువరైతు సాయికిరణ్ తెలుపుతున్నాడు.