శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : గురువారం, 2 ఆగస్టు 2018 (17:07 IST)

మునిగిపోనున్న భద్రాచలం పుణ్యక్షేత్రం.. ఎలా?

శ్రీరామచంద్రుడు - సీతాదేవి నడయాడిన భూమిగా ప్రసిద్ధికెక్కిన భద్రాచలం పుణ్యక్షేత్రం ఇపుడు నీటమునిగిపోయే ప్రమాదం ఏర్పడివుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న పోలవరం ప్రాజెక్టుతో భద్

శ్రీరామచంద్రుడు - సీతాదేవి నడయాడిన భూమిగా ప్రసిద్ధికెక్కిన భద్రాచలం పుణ్యక్షేత్రం ఇపుడు నీటమునిగిపోయే ప్రమాదం ఏర్పడివుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న పోలవరం ప్రాజెక్టుతో భద్రాచలంతో పాటు బొగ్గు గనులున్న ప్రాంతాలకూ ముప్పు వాటిల్లుతుందని తెలంగాణ సర్కారు ఆందోళన వ్యక్తంచేస్తోంది. ఇదే అంశంపై సుప్రీంకోర్టులో ఓ అఫిడవిట్‌ను దాఖలు చేసింది.
 
తెలంగాణ ప్రాంత భూభాగం, అక్కడి ప్రజల మనోభావాలు, పర్యావరణం, తదితర అంశాలను పరిగణనలోకి తీసుకొని మరోసారి పూర్తిస్థాయిలో సమగ్ర సర్వే చేపట్టాని కోరింది. ఈ సమస్య పరిష్కారానికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలని అఫిడవిట్‌లో కోరింది. ఈ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా ఇప్పటికే ఒడిషా ప్రభుత్వం సుప్రీంకోర్టులో కేసు వేసిన విషయం తెల్సిందే. 
 
ఈ కేసు పరిధిలోకి తెలంగాణ ప్రభుత్వాన్ని కూడా తీసుకురావాలన్న ఒడిషా వినతిని సుప్రీం అంగీకరించింది. పోలవరం ప్రాజెక్టుపై అభ్యంతరాలను తెలియజేయాలని సుప్రీం ఆదేశించడంతో తెలంగాణ ప్రభుత్వం తరపున సీనియర్ లాయర్ వైద్యనాథన్ వాదనలు వినిపించేందుకు సిద్ధమయ్యారు. 50 లక్షల క్యూసెక్కుల వరద ప్రవాహ వేగం వస్తుందన్న అంచనాతో ఈ ప్రాజెక్టును నిర్మిస్తున్నారని.. గోదావరిలో ఒక్కసారిగా అంత భారీ ప్రవాహం వస్తే, భద్రాచలంతో పాటు బొగ్గు నిల్వలు ఉండే ప్రాంతాలు మునిగిపోతాయని అభిప్రాయపడుతున్నారు.