తూగో వైసీపీలోకి భారీగా చేరికలు
తూర్పు గోదావరి జిల్లా జగ్గంపేట నియోజవర్గం నుంచి పెద్ద ఎత్తున టీడీపీ నేతలు వైసీపీలో చేరారు. టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు సమక్షంలో టీడీపీకి చెందిన నేతలు వైసీపీ కండువా కప్పుకున్నారు.
వైసీపీలో చేరినవారిలో టీడీపీ కీలక నేతలు, మాజీ జెడ్పీటీసీ, ఎంపీటీసీలు, మాజీ సర్పంచ్‌లు ఉన్నారు. ఈ సందర్భంగా వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ.. స్థానిక సంస్థల ఎనికల్లో వైసీపీ భారీ మెజారిటీ సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలే పార్టీ అభ్యర్థులను గెలిస్తాయని అన్నారు.
సీఎం వైఎస్ జగన్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్పందన కార్యక్రమం ద్వారా దీర్ఘకాలిక సమస్యలు పరిష్కారం అవుతున్నాయని తెలిపారు. విజయవాడలో 13 ఏళ్ల అమ్మాయి తల్లిదండ్రులకు దొరికిందంటే అది స్పందన కార్యక్రమం వల్లనే అని గుర్తుచేశారు. సీఎం వైఎస్ జగగన్ ప్రజారంజక పాలన అందిస్తున్నారని కొనియాడారు.