ఆదివారం, 12 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : మంగళవారం, 10 డిశెంబరు 2019 (11:27 IST)

వైకాపాలోకి గోకరాజు గంగరాజు కుటుంబ సభ్యులు

కొన్ని రోజులుగా వస్తున్న వార్తలు నిజమయ్యాయి. భాజపా కీలక నేత మాజీ ఎంపీ గోకరాజు గంగరాజు కుటుంబ సభ్యులు అధికార పార్టీ చెంతకు చేరారు. సీఎం జగన్ వారికి పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు.

భాజపా నేత, మాజీ ఎంపీ గోకరాజు గంగరాజు కుటుంబసభ్యులు వైకాపాలో చేరారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి జగన్‌ కండువా కప్పి వారిని పార్టీలోకి ఆహ్వానించారు.

గోకరాజు గంగరాజు కుమారుడు వెంకటకనక రంగరాజు, సోదరులు గోకరాజు రామరాజు, వెంకట నరసింహరాజు వైకాపా తీర్థం పుచ్చుకున్నారు. సీఎం అమలు చేస్తున్న పథకాల పట్ల ఆకర్షితులై పార్టీలో చేరుతున్నట్లు గోకరాజు కుటుంబీకులు తెలిపారు.