శుక్రవారం, 29 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 2 జూన్ 2020 (09:13 IST)

కోటి రూపాయలు టోకరా.. కి''లేడీ'' అరెస్ట్.. భర్త కూడా సహకరించాడట..

మహిళలపై అకృత్యాలు పెరిగిపోతున్న తరుణంలో.. మహిళలు కూడా మగాళ్లు నమ్మించి మోసం చేసే ఘటనలు జరుగుతూనే వున్నాయి. తాజాగా అలాంటి ఘటనే హైదరాబాదులో చోటుచేసుకుంది. ఆర్థికంగా సాయం చేస్తే పెళ్లి చేసుకుంటానని ఓ సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ను నమ్మించి రూ.కోటితో ఉడాయించిందో కి"లేడీ". 
 
కేపీహెచ్‌బీ సీఐ లక్ష్మీనారాయణ ఈ ఘటనపై మాట్లాడుతూ.. వసంతనగర్‌కు చెందిన చైతన్య విహారి ఉప్పలపాటి సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌. అతనికి తెలుగు మాట్రిమొనీలో అనుపల్లవి మాగంటి పేరిట ఓ మహిళ పరిచయమైంది. 
 
తాను వైద్యురాలిగా జూబ్లీహిల్స్‌లో ఉంటున్నట్లు నమ్మించింది. తనకు దక్కాల్సిన ఆస్తులు కుటుంబ సభ్యులు ఇవ్వనంటున్నారని, లీగల్‌ సమస్యల పరిష్కారానికి రూ.కోటి ఖర్చవుతుందని నమ్మబలికింది. దీంతో బాధితుడు రూ.1.02 కోట్లు ఆమెకు బదిలీ చేశాడు. కానీ తర్వాతే ముఖం చాటేసింది. 
 
ఇదే తరహాలో ఎన్‌ఆర్‌ఐలకు వల విసురుతున్న ఈమెను జూబ్లీహిల్స్‌ పోలీసులు గత నెల 27న అరెస్ట్‌ చేశారు. భర్తతోపాటు ఇతర కుటుంబ సభ్యులూ ఆమెకు సహకరిస్తున్నట్లు తేలింది. విలాస జీవితానికి అలవాటు పడి మోసాలకు పాల్పడుతున్నట్లు గుర్తించామని చెప్పారు.