సోమవారం, 2 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : శుక్రవారం, 26 మే 2017 (09:20 IST)

చాక్లెట్ ఆశచూపి.. గదిలోకి తీసుకెళ్లి... మనుమరాలిపై తాత అత్యాచారం...

కామంతో కళ్లుమూసుకున్న కొందరు కామాంధులు వయసుతో పనిలేకుండా సభ్యసమాజం తలదించుకునే చర్యలకు పాల్పడుతున్నారు. తాజాగా హైదరాబాద్ నగరంలో కంటికి రెప్పలా చూసుకోవాల్సిన ఓ వృద్ధుడు... ఏడేళ్ళ వయసున్న మనుమరాలిపై అత్

కామంతో కళ్లుమూసుకున్న కొందరు కామాంధులు వయసుతో పనిలేకుండా సభ్యసమాజం తలదించుకునే చర్యలకు పాల్పడుతున్నారు. తాజాగా హైదరాబాద్ నగరంలో కంటికి రెప్పలా చూసుకోవాల్సిన ఓ వృద్ధుడు... ఏడేళ్ళ వయసున్న మనుమరాలిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అదీ కూడా చాక్లెట్ ఆశ చూపి ఈ దారుణానికి ఒడిగట్టాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
హైదరాబాద్, తుకారాంగేట్‌ ప్రాంతానికి చెందిన ఓ వృద్ధుడు కుటుంబ సభ్యులతో కలిసి నగరంలో నివాసముంటున్నాడు. వీరితో పాటు... ఏడేళ్ళ బాలిక కూడా నివాసముంటుంది. అయితే, ఇంట్లో ఎవరూ లేని సమయంలో మనవరాలు (7)కు చాక్లెట్‌ ఇస్తానని గదిలోకి తీసుకువెళ్లి లైంగిక దాడి చేశాడు. 
 
బయటకు వెళ్లిన తల్లి వచ్చేసరికి బాలిక ఏడుస్తోంది. ఆరా తీస్తే జరిగిన దారుణం గురించి తెలిసింది. బాలికకు తీవ్ర రక్తస్రావం కావడంతో చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. బాలిక తల్లి ఫిర్యాదు మేరకు తుకారాంగేట్‌ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.