శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : సోమవారం, 12 ఫిబ్రవరి 2018 (10:47 IST)

బొటానికల్ గార్డెన్ మర్డర్ మిస్టరీ వీడింది ... మరిదే హంతకుడు

హైదరాబాద్, బొటానికల్‌ గార్డెన్‌ దగ్గర మహిళ హత్య కేసులో మిస్టరీ వీడింది. గర్భిణిని ముక్కలుగా నరికి సంచుల్లో కుక్కి బొటానికల్ గార్డెన్ సమీపంలో పడేశారు. ఈ కేసులో పోలీసులకు హంతకుల ఆనవాళ్లు దొరికాయి.

హైదరాబాద్, బొటానికల్‌ గార్డెన్‌ దగ్గర మహిళ హత్య కేసులో మిస్టరీ వీడింది. గర్భిణిని ముక్కలుగా నరికి సంచుల్లో కుక్కి బొటానికల్ గార్డెన్ సమీపంలో పడేశారు. ఈ కేసులో పోలీసులకు హంతకుల ఆనవాళ్లు దొరికాయి. శవాన్ని బైక్‌పై తీసుకొచ్చి పడేసినట్టు సీసీ ఫుటేజీలు లభ్యమయ్యాయి. గత నెల 30న వెలుగులోకి వచ్చిన ఘటనకు సంబంధించి పోలీసులు 10కి పైగా వీడియోలను విశ్లేషించి హంతకుల్లో ఒక మహిళ, ఒక పురుషుడు ఉన్నట్టు గుర్తించారు.
 
ఈ కేసులో ద్విచక్ర వాహనం నంబరు ప్లేట్ ఆధారంగా నిందితులను గుర్తించారు. ఈ గర్భిణి హత్యకు కుటుంబ గొడవలే కారణమని పోలీసులు తేల్చారు. సొంత వదినను మరిది అమర్‌కాంత్‌ ఝా, ఆయన తల్లి కలిసి చంపినట్లు ప్రాథమికంగా పోలీసులు తేల్చారు. సీసీ కెమెరా దృశ్యాల ఆధారంగా నిందితుల ఆచూకీని గుర్తించినట్టు పోలీసులు వెల్లడించారు. 
 
ఈ హత్య అనంతరం అమర్‌కాంత్‌ ఝా బీహార్‌ పారిపోయాడు. మహిళ హత్య కేసులో గచ్చిబౌలి పోలీసులు అత్తను అదుపులోకి తీసుకున్నారు. పరారీలో ఉన్న అమర్‌కాంత్‌ ఝా, మృతురాలి భర్త కోసం పోలీసులు గాలిస్తున్నారు. సిద్దిఖీ నగర్‌లో నివాసం ఉంటున్న అమర్‌కాంత్‌ ఝా, ఆయన తల్లి కలిసి కోడలిని హత్య చేసి జనవరి 29న బొటానికల్‌ గార్డెన్‌ వద్ద మృతదేహాన్ని పడేశారు.